రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమా లో నటిస్తున్న విషయం తెలిసిందే..జిల్ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా లో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా పునర్జన్మల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. సాహో సినిమా ప్లాప్ గా నిలవగా ఆ సినిమా తర్వాత వచ్చే ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.. ఆ అంచనాలకు తగ్గట్లు ఈ సినిమా నుంచి వచ్చిన లుక్స్, టీజర్ కి ప్రేక్షకులు మంచి స్పందన ఇచ్చారు..  యూవీ క్రియేషన్స్ బ్యానర్, గోపికృష్ణ మూవీస్ బ్యానర్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తుండగా జులై లో ఈ సినిమా ను రిలీజ్ చేస్తుండడం విశేషం..