యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఏ టాలీవుడ్ హీరో పెట్టుకోని దర్శకుల లైనప్ ను పెట్టుకున్నాడు. వాస్తవానికి చెప్పాలంటే ఎన్టీఆర్ ఆర్ సెట్ చేసుకున్న దర్శకుల వరసను ఏ హీరో ఇంత బాగా ప్లాన్ చేసుకోలేదు అని చెప్పాలి. ప్రస్తుతం రామ్ చరణ్ తేజ్ తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కబోతున్న ఈ సినిమా కోసం దేశం మొత్తం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే వచ్చిన ఈ సినిమా టీజర్ లు సైతం దేశాన్ని ఎంతో ఆకట్టుకున్నాయి.