తమ తండ్రి చంద్రశేఖర్ అప్పు తెచ్చి , 60 లక్షలతో తండ్రి డైరెక్షన్లో "నాళయ తీర్పు"అనే సినిమాను తీశారు. కానీ ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. కానీ సినిమాలో విజయ్ ఎంతో అద్భుతంగా నటించాడు అని చెప్పవచ్చు. కానీ విజయ్ గురించి మాత్రం ప్రేక్షకులు వాళ్ళ తండ్రి డైరెక్షన్ లో హీరో అయ్యాడు.. అనే మాటలు ఎక్కువగా వినిపించాయి.అదే సమయంలో నే క్రిస్మస్ పండగ వచ్చింది.ఈ వార్తను చూసిన విజయ్ తన కోసం తెచ్చిన కొత్త బట్టలను కూడా విసిరేసి.. ఇంట్లో ఒక మూల ఏడ్చుకుంటూ కూర్చున్నాడు.