హీరోయిన్ ఆదా శర్మకి విజయవాడ ప్రజలు ఊహించని షాక్ ఇచ్చారు అనే వార్తలు వస్తున్నాయి. ‘గరం’ సినిమా ఘోర పరాజయంతో ఐరన్ లెగ్ హీరోయిన్ గా ముద్ర వేయించుకున్నఆదాశర్మ దశ తిరిగి ‘క్షణం’ సినిమా సూపర్ హిట్ కావడంతో మంచి జోష్ లోకి వెళ్ళిపోయింది. ఈ సినిమా యూనిట్ సక్సెస్స్ మీట్ ను నిర్వహించేందుకు విజయవాడ వస్తున్న నేపధ్యంలో ముందుగానే తన ట్విటర్ లో ఫలానా మాల్ లో మిమ్మల్ని కలుస్తానంటూ ట్వీట్ కూడ చేసింది.
దీనితో ఫ్యాన్స్ భారీగానే చేరుకున్నారు. అంతేకాదు మరి కొంతమంది ఈమె వీరాభిమానులు అయితే గరం గరం, క్షణం క్షణం అంటూ ఆదా శర్మ పై స్లొగన్స్ కూడ ఇచ్చారట. ఇంత వరకు బాగానే ఉన్నా ఈకార్యక్రమం పూర్తి అయిపోయాక ఈమెకు చుక్కలు కనిపించాయి అని తెలుస్తోంది.
ఆ మాల్ నుండి ఆమె తిరిగి వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్న సమయంలో కొందరు ఆదా దగ్గరకు వచ్చేందుకు ముచ్చట పడ్డారని తెలుస్తోంది. అయితే అక్కడ భారీగానే సెక్యూరిటీ స్టాఫ్ ఉన్నా దాదాపు 2వేలకు పైగా జనాలు ఒకేసారి తోసుకురావడంతో తొక్కిసలాట జరిగింది అని తెలుస్తోంది. ఈ సంఘటనలో కొందరు ఆదా శర్మను బాగా ఇబ్బంది పెట్టారని కూడ తెలుస్తోంది. అంతేకాదు మరి కొంతమంది అయితే రెట్టిoచిన ఉత్సాహంతో ఆమెను టచ్ చేయాలని ప్రయత్నించినట్లు కూడ వార్తలు వస్తున్నాయి. దీనితో షాక్ అయిన ఆదా శర్మ హైద్రాబాద్ వెళ్లిపోయింది అని తెలుస్తోంది.
గతంలో సమంత, తాప్సీ, హెబా పటేల్ లాంటి స్టార్స్ ఇలా అభిమానుల మధ్యకు వచ్చినప్పుడు ఇటువంటి సంఘటనలు ఎదుర్కున్న సంగతి తెలిసిందే. ఈమధ్య కాలంలో ఇటువంటి సంఘటనలు తరుచు జరుగుతూ ఉండటంతో చాలామంది హీరోయిన్ లు సినిమా ప్రచారం కోసం జనం మధ్యకు రావడానికి భయ పడిపోతున్నారు అనే వార్తలు కూడ ఉన్నాయి..