వైకాపా ఏపీ లో అధికారంలోకి వచ్చిన తరువాత సినిమా తారలు ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు.  ఎందుకు ఆలా చేస్తున్నారో తెలియడం లేదు.  రాజకీయాలు వేరు.. సినిమా వేరు ఆ సంగతి అందరికి తెలిసిందే.  కానీ, రాష్ట్రంలో ఒక పార్టీ గెలిచిన తరువాత ఆ పార్టీ నేతలను అభినందించడం.. ఆ పార్టీ ముఖ్యమంత్రితో కలిసిమెలిసి ఉండటం ఎప్పటి నుంచో వస్తూనే ఉన్నది. బాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలానే జరిగింది.  సినిమాలకు సంబంచించిన చాలా కార్యక్రమాలకు బాబు హాజరయ్యేవారు.  


రాజకీయ కార్యక్రమాల్లో భాగం పంచుకునేవారు సినిమా తారలు.  ఇప్పుడు తెలంగాణాలో కేటీఆర్ ప్రారంభించిన అనేక కార్యక్రమాలకు సినిమా తారలు అండగా ఉంటున్నారు.  ప్రమోట్ చేస్తున్నారు.  ముఖ్యంగా పరిసరాల శుభ్రత విషయంలో ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ కేటీఆర్ ను పొగుడుతున్నారు.  అయిదు, ఏపీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పధకాల గురించి మాట్లాడటం లేదు.  కారణం ఏంటి అనే విషయం ఎవరికీ తెలియడం లేదు.  


ఇక ఇదిలా ఉంటె, వైకాపాకు సినిమా తారలు సపోర్ట్ చేయడం లేదంటూ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీపై 30 ఇయర్స్ ఇండస్ట్రీ నటుడు పృథ్వి పేర్కొన్న సంగతి తెలిసిందే.  దీంతో టాలీవుడ్ పరిశ్రమ సీరియస్ అయ్యింది.  ఆయనపై చర్యలు తీసుకోవాలని అనుకుంది.  సినిమా ఇండస్ట్రీకి ఆయన్ను దూరంగా ఉంచింది.  ఈలోగా జగన్ పృథ్వికి ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు.  దీంతో పృథ్వి సినిమా ఇండస్ట్రీకి దూరం అయినట్టే అనుకున్నారు.  


కానీ, ఆయనకు మెగాస్టార్ సైరా సినిమాలో ఓ పాత్ర లభించింది.  ఆ పాత్రను చేసిన పృథ్వి సైరా ప్రీ రిలీజ్ వేడుకకు హాజరయ్యారు.  ఈ వేడుకలో మెగాస్టార్ గురించి ఎప్పుడు లేనంతగా పొగడ్తల కురిపంచారు.  దీంతో సినిమా ఇండస్ట్రీలో గుససగుసలు మొదలయ్యాయి.  పృథ్వి సినిమా ఇండస్ట్రీని, అటు రాజకీయాలను బ్యాలెన్స్ చేసుకుంటూ పోతున్నారని, వైకాపాను, సినిమాలను దూరం చేసుకోవడం ఇష్టం లేదని అందుకే మెగాస్టార్ ను ఆకాశానికి ఎత్తారని వార్తలు వినిపించాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: