డిసెంబర్ 20న బాలకృష్ణ రవితేజల మధ్య మూవీ వార్ జరగడం ఖాయం అన్న సంకేతాలు వస్తున్నాయి. ఇండస్ట్రీలో వినపడుతున్న వార్తల ప్రకారం రవితేజ ‘డిస్కోరాజ’ అదేవిధంగా బాలకృష్ణ కె.ఎస్. రవికుమార్ ల మూవీలకు సంబంధించిన బిజినెస్ ను ఆ మూవీ నిర్మాతలు ఇప్పటికే ప్రారంభించడమే కాకుండా తమ సినిమాలు డిసెంబర్ 20న విడుదల అవుతున్నట్లుగా స్పష్టమైన లీకులు ఇస్తున్నట్లు సమాచారం.

వాస్తవానికి ప్రస్తుతం రవితేజాకు కానీ అదేవిధంగా బాలకృష్ణకు కానీ మార్కెట్ ఏమాత్రం బాగాలేదు దీనితో ఈ మూవీల పై భారీ మొత్తాలను పెట్టడానికి బయ్యర్లు జంకుతున్నారు. అయితే ఈ రెండు సినిమాలు మోడరేటు బడ్జెట్ తో తీసిన పరిస్థితులలో బయ్యర్లను భయపెట్టకుండా ఈ మూవీ రైట్స్ ను తక్కువ మొత్తాలకే ఆఫర్ చేస్తున్నట్లు టాక్. 

అయితే ఈ రెండు మూవీలు ఒకదానిపై ఒకటి పోటీగా విడుదల అవుతున్న విషయాన్ని గ్రహించిన బయ్యర్లు ఇద్దరి ఫెయిల్యూర్ హీరోల మధ్య పోటీ ఏమిటి అని ఈ మూవీ నిర్మాతలను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ‘డిస్కోరాజా’ నిర్మాతలు ఈ విషయమై బయ్యర్లకు ధైర్యం చెప్పడానికి ఒక ఆసక్తికర సెంటిమెంట్ ను బయటకు తీసుకు వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

గతంలో రవితేజ బాలకృష్ణల సినిమాలు ఒకేసారి పోటీగా విడుదలైన ప్రతిసారి బాలయ్య పై రవితేజ ఆధిపత్యం వహించిన విషయాన్ని గుర్తుకు చేస్తూ అదే సెంటిమెంట్ ఇప్పుడు కూడ రిపీట్ అవుతుందని చెప్పడమే కాకుండా ‘డిస్కో రాజ’ మినుమమ్ గ్యారెంటీ మూవీ అని ఈ మూవీ నిర్మాతలు బయ్యర్లకు ధైర్యం చెపుతున్నట్లు లీకులు వస్తున్నాయి. ఈ సెంటిమెంట్ ను కొద్దిగా బయ్యర్లు నమ్మినా వీరిద్దరి మధ్య అదేరోజు రాబోతున్న సాయి తేజ్ ‘ప్రతిరోజు పండగే’ పరిస్థితి ఏమిటి అంటూ ప్రశ్నలు వేస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో డిసెంబర్ 20న ముగ్గురు ఫెయిల్యూర్ హీరోల మధ్య వార్ జరగబోతోంబా అన్న సందేహాలు కలుగుతున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: