ఫిలిం ఇండస్ట్రీలో రాజకీయాలలో స్నేహాలు బంధుత్వాలు శాస్వితంగా కొనసాగవు. ఆర్ధిక పరిస్థితులలో పదవులలో వచ్చే తేడాలు ఎంత దగ్గర స్నేహితులు బంధువులు అయినప్పటికీ బయటకు చెప్పుకోలేని గ్యాప్ ను క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితులలో
పూరి జగన్నాథ్ తో సినిమాను చేయబోతున్న పూరీ జగన్నాథ్
విజయ్ దేవరకొండల మధ్య ఒకవిచిత్ర బంధుత్వం ఉంది అన్నవిషయం ఈమధ్యనే వెలుగులోకి వచ్చింది.
విజయ్ దేవరకొండ తండ్రి గోవర్ధన్ కు సినిమాలు అంటే విపరీతమైన మోజు చిన్నతనం నుండి ఉండటంతో సినిమాలలో హీరోగా మారాలని ఒక ఫిలిం ఇన్ స్టిట్యూట్ లో గతంలో శిక్షణ తీసుకున్నాడట. అప్పట్లో అదే ఇన్ స్టిట్యూట్ లో పూరీ జగన్నాథ్ కూడ దర్శకత్వ శాఖలో శిక్షణ పొందుతున్న ఆరోజులలో వీరిద్దరికీ అప్పట్లో మంచి పరిచయం ఉందట.అయితే ఆతరువాత కాలంలో పూరీ జగన్నాథ్ టాప్ దర్శకుడుగా మారిపోతే అవకాశాలు రాకపోవడంతో
విజయ్ తండ్రి గోవర్ధన్ ఒక ఉద్యోగంలో సెటిల్ అయిపోయాడు.
ఆతరువాత కాలంలో అతడికి
విజయ్ పుట్టడం అతడు పెరిగి అతడికి కూడ సినిమాల పై మోజు ఏర్పడటంతో అవకాశాల కోసం వెతుక్కుంటూ దాదాపు 5 సంవత్సరాల పాటు తండ్రి పంపించే డబ్బుతోనే అప్పటి తన జీవితాన్ని కొనసాగించాడు. అయితే తన తండ్రిపంపే డబ్బు సరిపోవక పోవడంతో ఇబ్బంది పడుతున్న
విజయ్ ని చూసి గోవర్ధన్ అతడి కొడుకుని
పూరి జగన్నాథ్ వద్దకు వెళ్ళి అతడి దగ్గర సహాయ దర్శకుడుగా పనిచేస్తే
పూరి తన సహాయకులకు మంచి జీతాలు ఇస్తాడు కాబట్టి
విజయ్ సమస్యలు తీరుతాయని సలహా ఇచ్చాడట. అయితే తండ్రి ఇచ్చిన సలహా నచ్చక పోవడంతో అలాగే అవకాశాలు వెతుక్కుంటూ ‘పెళ్ళి చూపులు’ మూవీలో నటించి హీరోగా సెటిల్ అయిపోయాడు.
ఆతరువాత ‘అర్జున్ రెడ్డి’ తో
విజయ్ క్రేజీ హీరోగా మారిపోవడంతో పూరిజగన్నాథ్ కు
విజయ్ తన స్నేహితుడు గోవర్ధన్ కొడుకు
విజయ్ అని తెలిసిందట. ఆతరువాత పరుశు
రామ్ ‘గీత గోవిందం’ మూవీని
విజయ్ తో తీస్తున్నప్పుడు అతడి డైలాగ్ డెలివరీ టైమింగ్ నచ్చి పరుశు
రామ్ పూరీతో
విజయ్ తో
సినిమా చేయవచ్చు కదా అంటూ సలహా ఇస్తే వరస హిట్స్ మీద ఉన్న ఫెయిల్యూర్ లో ఉన్న తనవంక ఎందుకు చూస్తాడు అంటూ జోక్ చేసాడట. ఆతరువాత
విజయ్ ‘డియర్ కామ్రేడ్’ ఫెయిల్ అవ్వడం పూరీ ‘ఇస్మార్ట్ శంకర్’ సూపర్ హిట్ కావడంతో వీరిద్దరికీ తమ పాత బంధుత్వం గుర్తుకు రావడమే కాకుండా ఛార్మీ చేసిన రాయబారాలతో వీరిద్దరి ప్రాజెక్ట్ ఒకే కావడమే కాకుండా త్వరలో పట్టాలు ఎక్కే స్థాయికి చేరుకుంది..