ఆ శుభవార్త కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. నిజం చెప్పాలంటే కళ్ళు  కాయలు కాచేలా  చూస్తున్నారు. తమ అభిమాన కధానాయకుడు బాలక్రిష్ణ ఏకైక కుమారుడు  మోక్షజ్ఞ ఎంట్రీ కోసం పడిగాపులే కాస్తున్నారు. తెలుగు తెర మీద వెలిగిన టాప్ స్టార్స్, సీనియర్ హీరోల కొడుకుని ఇప్పటికే ఎంట్రీ ఇచ్చేసి దూసుకుపోతున్నారు. మరి బాలయ్య కొడుకు కూడా హీరో కావాలన్నది నందమూరి ఫ్యాన్స్ ఆశ. తపన. అయితే అదిగో ఇదిగో అంటూ ప్రకటనలు వస్తున్నా కూడా మోక్షజ్ఞ ఎంట్రీ మాత్రం లేదు. అయితే ఇపుడు మరో న్యూస్ వచ్చింది. అదే నందమూరి ఫ్యాన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.


బాలక్రిష్ణతో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తీసుకున్న హ్యాట్రిక్ మూవీ  ద్వారా  మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తాడని అంటున్నారు. ఈ మూవీ లో బాలయ్య పవర్ ఫుల్ రోల్ ప్లే చేస్తాడని అంటున్నారు.  ఇలా  తండ్రి సినిమాలో తనయుడు మోక్షజ్ఞ కూడా కనిపిస్తాడట. మరి మోక్షజ్ఞ ఏ రోల్ చేస్తున్నాడు అన్నది తెలియదు కానీ బోయపాటి అంటేనే మాస్, యాక్షన్ ని పెట్టింది పేరు. ఆ విధంగా చూస్తే మోక్షజ్ఞ కూడా బోయపాటి ద్వారా పరిచయం అవుతున్నారు కాబట్టి ఫుల్ గా ప్యాక్ చేసిన యాక్షన్ రోల్ లోనే కనిపిస్తాడని అంటున్నారు. 


ఇక బాలయ్య కూడా మొదట ఇలాగే తన తండ్రి ఎన్టీయార్ సినిమాల్లోచిన్న  పాత్రలు వేస్తూ  కనిపించారు. అలాగే మోక్షజ్ఞ ఎంట్రీని కూడా ప్లాన్ చేశారని అంటున్నారు. ఈ న్యూస్ లో నిజం ఎంత ఉందో తెలియదు కానీ బాలయ్య ఫ్యాన్స్ మాత్రం తెగ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇదిలా ఉండగా బాలయ్య రూలర్ మూవీ ఈ ఏడాది డిసెంబర్ 20న విడుదల కానుంది.  ఆ తరువాత జనవరి నుంచి బోయపాటి, బాలయ్య మూవీ స్టార్ట్ అవుతుందని అంటున్నారు. ఆ మూవీని బ్లాక్ బస్టర్ గా తీర్చిదిద్దడానికి సరిపడా స్క్రిప్ట్ ను బోయపాటి దట్టించి మరీ రెడీ చేశారని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: