దర్శక దిగ్గజం రాజమౌళి చెక్కబోతున్న మరో మూవీ ఆర్.ఆర్.ఆర్. ఇప్పటికే ఈ సినిమా మీద అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. రాజమౌళి సినిమా కాబట్టి దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న సినిమాల్లో ప్రేక్షకులు అత్యంత ఆసక్తితో ఎదురు చూస్తున్న సినిమాల లిస్టు తీస్తే 'RRR' అగ్రభాగాన నిలుస్తుంది. రాజమౌళి సినిమా కావడంతో ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురు చూస్తున్నారు. ఇక తెలుగువారికి ఈ చిత్రం మరింత ప్రత్యేకం.  ఎందుకంటే ఇద్దరు అగ్ర కథానాయకులు ఎన్టీఆర్.. రామ్ చరణ్ ఈ సినిమాలో కలిసి నటిస్తున్నారు.

 

ఈ ఇద్దరి స్టార్ హీరోలను ఒకే తెర మీద చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్  డేట్ ను మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాను వచ్చే ఏడాది జులై 30 వ తేదీన విడుదల చేస్తామని 'RRR' టీమ్ చాలా నెలల క్రితమే ప్రకటించింది.  మధ్యలో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అయిందని.. విడుదల తేదీని మార్చే ఆలోచనలో ఉన్నారని వార్తలు వచ్చాయి కానీ అదేమీ లేదని చరణ్ కొద్ది రోజుల క్రితం క్లారిటీ ఇచ్చారు. ఇక 'RRR' యూనిట్ కూడా ఈమధ్య సినిమా షూటింగ్ 70% పూర్తయిందని వెల్లడించారు.  ఈ లెక్కన ఈ సినిమా అనుకున్న సమయానికి రావడం పక్కా అని తేలిపోయింది.  ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ కు సరిగ్గా 250 రోజుల సమయం ఉంది.  దీంతో చరణ్.. ఎన్టీఆర్ అభిమానులు ట్విట్టర్ లో #250DaysToMassiveRRR అంటూ ఒక హ్యాష్ టాగ్ ను ట్రెండ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు.  



నిజానికి సినిమా విడుదలకు ఇన్ని రోజులు టైం ఉన్నప్పుడు ఇంత హడావుడి ఉండదు. కానీ రాజమౌళి సినిమా వేరు కదా !సహజంగా 100 రోజులలో విడుదల ఉందనగా.. 50 రోజులలో విడుదల ఉందనగా ఇలాంటి హ్యాష్ టాగ్స్ ను ట్విట్టర్లో ట్రెండ్ చేస్తారు.  ఈ సినిమాకు అలానే 250 రోజుల కౌంట్ డౌన్ ను సెలెబ్రేట్ చేసుకోవడం విశేషం.  ఇలా ట్రెండ్ చేసేందుకు అభిమానులు దాదాపుగా 80 వేల ట్వీట్స్ చేయడం గమనార్హం.  దీన్ని బట్టి అభిమానుల్లో ఈ సినిమా పట్ల ఎంత ఉత్సాహం ఉందో తెలుస్తుంది. ఇక ఈ సినిమా టీజర్.. ట్రైలర్లు రిలీజ్ అయితే సోషల్ మీడియా షేక్ అవ్వడం ఖాయమే. 

మరింత సమాచారం తెలుసుకోండి: