టాలీవుడ్ లో ఒకప్పుడు కామెడీ హీరోగా మంచి పేరు తెచ్చుకున్న నటుడు సినియర్ నరేష్.  ప్రముఖ నటి, నిర్మాత, దర్శకురాలు స్వర్గీయ విజయనిర్మల తనయుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన నరేష్ ఎన్నో కామెడీ సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే.  ఆయన నటించిన చిత్రం భలారే విచిత్రం ఎప్పటికీ మరువలేనిదిగా నిలిచింది.  ఈ మూవీలో ఆయన లేడీ గెటప్ తో నిప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన నరేష్ తండ్రి, మామ పాత్రల్లో నటిస్తున్నారు.  ఈ సంవత్సరం మా అసోసియేష్ ఎన్నికల్లో ఎన్నో సంచలనాలు సృష్టించిన నరేష్ ప్యానెల్ మొత్తానికి నెగ్గడం..నరేష్ అధ్యక్షులుగా నియమితులయ్యారు. 

 

ఈ మద్య మా కొత్త రగడ మొదలైన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో తన సభ్యులపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు నరేష్.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పవన్ కళ్యాన్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  పవన్ కళ్యాన్ అంటే తనకు చాలా ఇష్టమని.. ఆయన ఇండస్ట్రీలో కోట్లు సంపాదించుకోవాలంటే  పెద్ద కష్టమైన పని కాదు.  ఆయన కోసం దర్శక, నిర్మాతలు క్యూ కడతారు.  కానీ ఆయన ప్రజలే నా ప్రాణం అంటూ.. ప్రజల కోసం తన కెరీర్ ని పక్కన బెట్టి ఓ పార్టీ స్థాపించి ప్రజల మద్యకు వచ్చారు.  ఇవాళ ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే వందో, రెండొందల కోట్లో కావాలని అన్నారు.

 

డబ్బు ఉంటేనే రాజకీయాలు.. రాజకీయాల్లోకి వచ్చిన డబ్బు సంపాదించడమే పరమావధిగా కొంత మంది నేటి సమాజంలో చూస్తున్నాం.  అయితే పవన్ కళ్యాన్ మాత్రం పీక్ లో ఉన్నటువంటి కెరీర్ ని వదిలి.. ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజల్లోకి వెళ్లి పాటిస్తున్నారు. అలాంటి వ్యక్తి ఇక్కడి రాజకీయంలోకి కావాలి  అని అభిప్రాయపడ్డారు. ఇెక పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారన్న విమర్శలపై ఆయన స్పందిస్తూ, ఒకరి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే హక్కు ఎవరికైనా ఉందా? అని ప్రశ్నించారు.  ఎవరి జీవితంలోకి ఎవరూ తొంగి చూడలేరు.. ఇంట్లో ఉన్న ఇబ్బందులు ఎవరు బయటకు చెప్పుకోలేరు. అలాంటి సమయంలో ఎవరైనా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారని, ఆ విషయాలను బహిరంగంగా ప్రస్తావించేవారికి  సిగ్గు అనిపించదా అని ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: