సూపర్ స్టార్ మహేష్ బాబు గత కొన్నేళ్లుగా వరుస హిట్ల‌తో దూసుకుపోతున్నారు. భరత్ అను నేను, మహర్షి, భరత్ అను నేను మ‌రియు ఇటీవ‌ల వ‌చ్చిన స‌రిలేరు నీకెవ్వ‌రూ ఇలా వ‌రుస‌గా ప‌రాజ‌య‌మే లేకుండా ముందుకు సాగుతున్నారు. అలాగే  టాలీవుడ్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు సౌతిండియా వైడ్ మహేష్ బాబును ఆరాధించే అభిమానులు ఉన్నారు. అయితే వాస్త‌వానికి మహేష్ బాబు నటనాజీవితం తన తండ్రి చిత్రాల్లోనే బాలనటుడిగా ఆరంభమయ్యింది. ఆ తరువాత చదువు మీద దృష్టి కేంద్రీకరించడం కోసం మహేష్ సినిమాలనుండి విరామం తీసుకున్నాడు. 

 

ఆ త‌ర్వాత మ‌ళ్లీ  తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారి నట వారసత్వంతో రాజకుమారుడు సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. అయితే మ‌హేష్‌కు కృష్ణ గారికి పోలికే లేదంటున్నారేంటి..? అస‌లు మ‌హేష్‌పై ఆ విమ‌ర్శలేంటి..? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం. సూప‌ర్ స్టార్ కృష్ణ.. ఈయ‌న గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్కర్లేదు. నటుడుగా, దర్శకుడుగా, నిర్మాతగా ఇలా అన్ని రంగాల్లోనూ రాణించారీయ‌న‌. అయితే ఈయ‌న ఎన్ని సినిమాలు చేసినా డ‌బ్బులు సంపాదించుకోలేక‌పోయాడు. ఎందుకూ అంటారా..? అదే ఆయ‌న గొప్ప‌త‌నం. ఏదైనా సినిమా ఫ్లాప్ అయినా లేదా ఎవ‌రైనా త‌న‌తో సినిమా చేసిన‌ నిర్మాత ఆర్థిక‌ ఇబ్బందుల్లో ఉన్నా.. కృష్ణ వాళ్ల‌కు ఫ్రీగా సినిమాలు చేసేవాడు. అందుకే ఈయ‌న నిర్మాత‌ల హీరో అయ్యాడు.

 

ఈ నేప‌థ్యంలోనే అప్ప‌ట్లోనే ఎంద‌రినో ఆదుకుని మంచి పేరు తెచ్చుకున్నాడు. దీంతో ఎన్ని సినిమాలు చేసినా పెద్ద‌గా డ‌బ్బులు సంపాదించ‌లేక‌పోయారు. ఇక త‌ర్వాత సొంతంగా సినిమాలు చేసి న‌ష్ట‌పోయారు. అయితే మ‌హేష్ బాబు మాత్రం అలా కాదంటున్నారు కొంద‌రు. ఎందుకంటే సినిమాకు మ‌హేష్ బాబు రెమ్యూన‌రేష‌న్‌తో పాటు నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ కూడా తీసుకుంటూ.. నిర్మాత‌ల పాలిట ఇబ్బందిగా మారాండంటూ ఈ మ‌ధ్య కాలంలో ప్ర‌ధాన ఆరోప‌ణ‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఈ విష‌యంలో మాత్రం మ‌హేష్‌బాబుకు మ‌రియు కృష్ణ గారికి అస‌లు పోలికే లేదంటూ కొంద‌రు అంటున్నారు. కానీ, మిగ‌తా విష‌యాల్లో మాత్రం తండ్రికి త‌గ్గా కొడుకు.. కేవ‌లం ఆ ఒక్క విష‌యం మార్చుకుంటే ఇంకా మంచిద‌ని కొంద‌రు అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: