తెలుగు తెరపై కామెడీ కింగ్ గా, నవ్వులరేడుగా, తొలి తెలుగు స్టార్ కామెడీ హీరోగా రాజేంద్రప్రసాద్ వెండితెర జీవితం ఓ అద్భుతమనే చెప్పాలి. ఎన్నో సినిమాల్లో ఆయన కామెడీని పండిస్తూ అందులో హీరోయిజాన్ని మిక్స్ చేస్తూ తన సినీ ప్రస్థానాన్ని కొనసాగించారు. ఈ ప్రయాణంలో అనేక విజయవంతమైన సినిమాల్లో నటించారు. రాజేంద్రుడికి కూడా ఓ హీరోయిన్ కలిసొచ్చింది.  రాజేంద్రప్రసాద్ – రజినీ కాంబినేషన్లో అనేక విజయవంతమైన సినిమాలు వచ్చి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు.

 

 

ఎనభయ్యో దశకంలో రాజేంద్రప్రసాద్రజినీ విజయవంతమైన జోడీగా పేరు తెచ్చుకున్నారు. భామాకలాపం, గుండమ్మ గారి కృష్ణులు, రెండు రెళ్లు ఆరు, గడుగ్గాయి, బంధువులొస్తున్నారు జాగ్రత్త, భలే మొగుడు, నాకూ పెళ్లాం కావాలి, అహనా పెళ్లంట.. వంటి అనేక సినిమాలు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చాయి. వీటిలో సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డి.రామానాయుడు నిర్మించిన అహనా పెళ్లంటా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రాజేంద్రుడు – రజినీ తెర మీద తమ నటనతో ప్రేక్షకులను గిలిగింతలు పెట్టారు. నాకూ పెళ్లాం కావాలి, రెండు రెళ్లు ఆరు సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. దీంతో వీరిద్దరి జోడీతో అనేక సినిమాలు వచ్చాయి. రాజేంద్రప్రసాద్ తో సినిమా అంటే రజినీ ఉండాల్సిందే అనే మాట అప్పట్లో ఇండస్ట్రీలో వినిపించేది.

 

 

రాజేంద్రప్రసాద్ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పేదమీ లేదు. పని ఒత్తిడి తగ్గించుకోవటానికి అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు రాజేంద్రుడి సినిమాలు చూసేవారు. అందులో రాజేంద్రప్రసాద్రజినీ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు కూడా ఉండేవి. గ్రామీణ నేపథ్యంలో సరదా కామెడీతో వీరిద్దరి సినిమాలు ప్రేక్షకులను మంచి ఉపశమనాన్ని ఇచ్చేవి. తర్వాత కాలంలో వారిద్దరి కుటుంబాలు ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా మంచి రిలేషన్ లో ఉన్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: