మెగా మేనల్లుడు గా అల్లు వారి వారసుడిగా తెలుగు చిత్రపరిశ్రమకు గంగోత్రి సినిమా తో పరిచయమైన అల్లు అర్జున్ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన  గంగోత్రి సినిమా అల్లు అర్జున్ కెరీర్ కు మంచి పునాది వేసింది. ఇక ఆ తర్వాత వచ్చిన బన్ని ఆర్య సినిమాలు అల్లు అర్జున్ ఇమేజ్ ని బాగా పెంచేశాయి. ఇక మొదటి సినిమా నుంచే అల్లు అర్జున్ తన డాన్సులతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. క్రమక్రమంగా తన డాన్సులతో తెలుగు ప్రేక్షకులని మెస్మరైజ్ చేశాడు. ఇక అదిరిపోయే యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టి తెలుగు ప్రేక్షకులకు ఫేవరెట్ హీరో గా మారిపోయాడు. ఎప్పుడు భిన్నమైన స్టైల్ లో కనిపిస్తూ... టాలీవుడ్ ప్రేక్షకుల స్టైలిష్ స్టార్ గా మారిపోయాడు అల్లు అర్జున్.

 

 

 అయితే సినిమా హీరోలకు ఎన్నో లవ్ స్టోరీ లు ఉంటాయి అన్న విషయం తెలిసిందే. కొంతమంది హీరోలకు లవ్ స్టోరీలు  కేవలం సినిమా వరకే పరిమితమైతే కొంత మంది హీరోలకు మాత్రం  నిజజీవితంలో కూడా ఎన్నో లవ్ స్టోరీలు  ఉంటాయి. బన్నీ లైఫ్ లో  కూడా ఎన్నో లవ్ స్టోరీలు  ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఒకానొక సమయంలో బన్నీ ఈ విషయాన్ని కాస్త రివిల్ కూడా చేసాడు. మామూలుగా సినిమా హీరోలు ఇతర చిన్న సినిమాల ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు వెళుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తమిళంలో ఒరు  అధార్.. తెలుగులో లవర్స్ డే పేరుతో విడుదలైన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్ళాడు. 

 

 

 ఈ సందర్భంగా మాట్లాడిన అల్లు అర్జున్ సినిమా టైటిల్ నాకు బాగా ఇష్టమైన రోజు అంటూ చెప్పుకొచ్చాడు. తాను 14 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు లవర్స్ డే గురించి తన స్నేహితులు తనకు చెప్పారని... ఇక అప్పటి నుంచి తాను లవర్స్ డే ని  ప్రతి సంవత్సరం ఎంతో బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. తన పుట్టిన రోజును ప్రతి సంవత్సరం ఎంత స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకుంటానో... అంతకంటే ఎక్కువగానే ప్రేమికుల రోజును ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటాను అంటూ మురిసి పోయాడు అల్లు అర్జున్. అంటే అల్లు అర్జున్ కి చాలానే లవ్ స్టోరీస్ ఉన్నాయి  అని చెప్పకనే చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: