తెలుగు బుల్లి తెరను అలరించిన యాంకర్స్ లో సుమా కనకాల ఒకరు. బుల్లి తెర మీద ఏ షో వచ్చినా సరే ఆమె లేకుండా ఉండటం అనేది కష్టం. దాదాపు రెండు దశాబ్దాల నుంచి సుమ తెలుగు బుల్లి తెర మీద ఒక వెలుగు వెలుగుతుంది. ఆమెకు వయసు మీద పడుతున్నా సరే నిర్మాతలు ఆమె వైపే మొగ్గు చూపిస్తున్నారు. హీరోయిన్ కి ఉండే అందం కాదు ఆమెది, అయినా సరే సుమా లేని షో అనేది ఈ మధ్య కాలంలో మనం చూడలేదు. ఇప్పుడు అంటే యాంకర్లు కొత్త వాళ్ళు వచ్చారు గాని మొన్నటి వరకు సుమా అంటే క్రేజ్. 

 

ఎంత కొత్త వాళ్ళు వచ్చినా సరే ఆమె తనకంటూ ఉన్న బ్రాండ్ ఇమేజ్ ని ఎప్పుడూ కాపాడుకుంటూనే ఉంది. టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా తమ సినిమా కార్యక్రమాలకు సుమాని కోరుకుంటున్నారు అనేది వాస్తవం. అది ఏ అగ్ర హీరో అయినా సరే. అందుకే దర్శక నిర్మాతలు కూడా సుమా ఉంటే ఆడియో ఫంక్షన్ అయినా మరొకటి అయినా సరే సుమా ఉండాల్సిందే. ఆ విధంగా తెలుగు బుల్లి తెర మీద సుమ తన ముద్ర వేసింది అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. ప్రస్తుతం తెలుగు బుల్లి తెర మీద సుమాతో పాటుగా పది మంది యాంకర్లు ఉన్నారు. 

 

అయినా సరే ఏ సీరియస్ షో అయినా, ఏ కామెడి షో అయినా సరే నిర్మాతలకు ఆమె ఫస్ట్ ఆప్షన్. ఆమె అందుబాటులో లేకపోతేనే మరొకరి దగ్గరకి వెళ్తూ ఉంటారు. ఇలా ఆమె కెరీర్ లో ఒక వెలుగు వెలగడానికి ప్రధాన కారణం ఆమె భర్త. రాజీవ్ కనకాల సహకారంతో ఆమె కెరీర్ లో దూసుకుపోతుంది. ఆమె కెరీర్ కి ఎలాంటి అడ్డంకులు రాజీవ్ నుంచి రాలేదు. అన్ని విధాలుగాను ఆమెను ముందు ఉండి ప్రోత్సహించాడు. అందుకే నేడు సుమా ఈ స్టేజి లో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: