ఈ మధ్యనే జరిగిన హోలీ పండుగను జూనియర్ ఎన్టీఆర్ తన భార్య పిల్లలు అభిరామ్ భార్గవ రామ్ లతో కలిసి జరుపుకున్న ఒక ఫోటోను జూనియర్ తన ట్విటర్ ద్వారా తన అభిమానులకు షేర్ చేసాడు. ఈ ఫోటో వైరల్ అవ్వడంతో జూనియర్ అభిమానులు ఒకరికొకరు షేర్ చేసుకున్నారు. 


ఈ పరిస్థితులలో  ఈ ఫోటోలో తన తండ్రి జూనియర్ తో కలిసి ఉన్న బార్గవ రామ్ లుక్ చూసి తారక్ అభిమానులు విపరీతంగా ఆనంద పడిపోతు భార్గవ్ టాలీవుడ్ ఇండస్ట్రీ తైమూర్ అలీ ఖాన్ అంటూ భార్గవ్ రామ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కొడుకు తైమూర్ అలీ ఖాన్ అన్న విషయం చాలామందికి తెలిసిన విషయమే.


బాలీవుడ్ మీడియాలో మాత్రం బాలీవుడ్ హీరోల పిల్లలలో మోస్ట్ హ్యాండ్ సమ్ తైమూర్ అలీ ఖాన్ అంటూ ఈ చిన్న పిల్లవాడికి చిన్నప్పటి నుండే బాలీవుడ్ మీడియా ఒక ప్రత్యేకమైన ట్యాగ్ ను ఇచ్చింది. తైమూర్ లాగే భార్గవ్ రామ్ కూడ టాలీవుడ్ యంగ్ హీరోల పిల్లలలో మోస్ట్ హ్యాండ్ సమ్ అంటూ తారక్ అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.


అంతేకాదు భార్గవ్ రామ్ జూనియర్ జూనియర్ కన్నా గొప్పఅందగాడని భవిష్యత్తులో   భార్గవ్ జూనియర్ కొనసాగిస్తాడు అంటూ అప్పుడే ఊహాగానాలు మొదలైపోయాయి. అంతేకాదు మరికొందరు జూనియర్ అభిమానులు అయితే అల్లు అర్జున్ మంచు విష్ణులు తన పిల్లల గురించి తరుచూ షేర్ చేసే విధంగా వీడియోలు జూనియర్ తన అభిమానుల కోసం ఎందుకు షేర్ చేయడు అంటూ అభిమానులు జూనియర్ ను ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు అవకాసం ఉన్నప్పుడల్లా జూనియర్ తన పెల్లలలను తనతో  పాటు సినిమా ఫంక్షన్స్ కు తీసుకు వస్తే అభిమానులకు పండుగగా ఉంటుందికదా అంటూ సలహాలు ఇస్తున్నారు. అయితే తన పిల్లలను బయటకు తీసుకు రావడం పెద్దగా ఇష్టపడని జూనియర్ తన అభిమానుల సలహాలను పట్టించుకుంటాడా అన్నదే ప్రశ్న.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: