తెలుగు సినిమాల్లో విలన్ల విచిత్ర చేష్టలు భలే ఉంటాయి. ఓపెనింగ్ లో అతనో డాన్ గా అసలు ప్రపంచాన్ని గడగడలాడించే సత్తా ఉన్న వ్యక్తిగా చూపిస్తారు తీరా హీరో దగ్గరకు వచ్చే సరికి అతనో బకరాని చేస్తారు. ఎన్నో తెలివి తేటలు, తెగింపుతో ఉండే విలన్ డాన్ గా గొప్ప స్థాయిలో ఉన్నా ఒక్కోసారి హీరో వేసిన ట్రాప్ లో పడతాడు. తప్పదు కథ నడవాలంటే అలానే చేయాలని సమర్ధించవచ్చు. విలన్ ఎంత బలవంతుడైన సరే హీరో అతని పని పట్టాల్సిందే. కానీ కొన్ని సినిమాల్లో విలన్ ను చాలా స్ట్రాంగ్ గా చూపించి సాధారణ వ్యక్తి అయినా హీరో అతని ఢీ కొట్టడం అతనిపై విజయం సాధించడం చూపిస్తారు.

 

సినిమాలో హీరో గెలవాలి.. విలన్ ఓడి పోవాలి.. కథ ప్రకారంగా ఇదే ఫార్మేట్ నడుస్తుంది. కానీ సినిమాలో విలన్ ను అతి బలవంతుడిగా చూపించి హీరోతో అతన్ని ఢీ కొట్టే విధానం ఒక్కోసారి సిల్లీగా అనిపిస్తుంది. కమర్షియల్ సినిమా ఫార్మేట్ లో ఇదంతా కామనే అని సర్ది చెప్పుకున్నా మరీ ఇల్లాజికల్ అనిపించినప్పుడే తేడా కొడుతోంది. ప్రపంచంలో అతి బలవంతుడిగా కనిపించే విలన్ అయినా అతని మూలాలు హీరోకి దగ్గరగా.. హీరో ఫ్యామిలీకి అన్యాయం చేసిన వ్యక్తిగా చూపిస్తారు.

 

ఇదంతా కమర్షియల్ సినిమా లెక్క అన్ని సరిపెట్టుకున్నా కొన్ని సార్లు ఆడియెన్స్ కు ఇవే విసుగు తెప్పిస్తాయి. అయితే కొన్ని సార్లు మాత్రం విలన్ పాత్రని చూపించిన తీరు మాత్రం అదరహో అనిపిస్తుంది.  తెలుగు సినిమాల్లో విలనిజంలో వచ్చిన ఈ మార్పుని ఆడియెన్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. విలన్ అంటే డాన్ అనే కొన్నాళ్ల తెలుగు సినిమా సెంటిమెంట్ కు బ్రేక్ వేస్తూ కొత్త కథలతో కొత్త విలనిజంలో వస్తున్నారు.. రావాలని ఆశిద్దాం.  

మరింత సమాచారం తెలుసుకోండి: