టాలీవుడ్ లో అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన అక్కినేని అఖిల్ నటించి సినిమాలు ఇప్పుటి వరకు కమర్షియల్ హిట్ కావడం లేదు.  బాలనటుడిగా చిన్నప్పుడే తన టాలెంట్ ఏంటో చూపించిన అఖిల్ తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘మనం’ సినిమాలో క్లయిమాక్స్ లో మెరుపులా మెరిశాడు.  ఆ తర్వాత నితిన్ ప్రొడ్యూసర్ గా వివివినాయక్ దర్శకత్వంలో ‘అఖిల్’ మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు.  ఈ మూవీలో అఖిల్ డ్యాన్స్, ఫైట్స్ తో తెలుగు ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేశాడు.  కానీ ఈ మూవీ మాత్రం కమర్షియల్ హిట్ కాలేక పోయింది.  ఆ తర్వాత హలో, మిస్టర్ మజ్ను మూవీస్ కూడా ఆకట్టుకోలేకపోయాయి. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ తో  'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' లో నటిస్తున్నాడు.  


మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.  తాజాగా అఖిల్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ నితిన్ నిర్మాణంలో చేయాలని అనుకుంటున్నారట.  గతంలో అఖిల్ మొదటి సినిమాను వినాయక్ దర్శకత్వంలో నితిన్ నిర్మించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా వలన నితిన్ 25 కోట్ల వరకూ నష్టపోయాడు. అయితే ఈ నష్టాన్ని భర్తీ చేయాలనే ఆలోచనలో అఖిల్ తన ఐదవ సినిమా పారితోషికం తీసుకోకుండా ఆయన బ్యానర్లో  చేయాలనే నిర్ణయానికి వచ్చాడట.  సురేందర్ రెడ్డి ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తాడని చెబుతున్నారు.

 

 సురేందర్ రెడ్డి గత ఏడాది మెగాస్టార్ చిరంజీవితో ‘సైరా నరసింహారెడ్డి’ లాంటి ప్రతిష్టాత్మక సినిమా తీసిన విషయం తెలిసిందే.  పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించారు సైరా. కానీ ఆశించిన ఫలితం మాత్రం దక్కలేదు.   ఇక ఈ సినిమాను ఓ మాదిరి బడ్జెట్ లోనే నిర్మించే ఆలోచనలో నితిన్ వున్నాడని అంటున్నారు. వరుస అపజయాలతో ఇబ్బంది పడుతున్న అఖిల్ మరి  'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్'  మంచి విజయం అందుకుంటాడా లేదా చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: