భారత్‌ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతు దేశవ్యాప్తంగా దాదాపుగా 500 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ను చాలాచోట్ల ప్రజలు పట్టించుకోని పరిస్థితి నేపధ్యంలో ఇండియా పరిస్థితి ఏమిటి అన్నచర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి  పరిస్థితులలో ఇండియన్ మెడికల్ కౌన్సిల్ రీసెర్చ్ భారత్‌ లో కరోనా వైరస్ వ్యాప్తి గురించి అంచనా వేస్తూ ప్రచురించిన ఒక వ్యాసం ఇప్పుడు మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. 


ఢిల్లీ ముంబై కలకత్తా బెంగుళూరు నగరాల్లో 5లక్షల వరకు కేసులు నమోదు కావచ్చని ఆ నివేదిక అభిప్రాయ పడుతుంది. ఇలాంటి పరిస్థితులలో విజ‌య‌శాంతి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి ‘దయచేసి అర్థం చేసుకోండి. ఒక్కరోజు కాదు వారం రోజులు ఇంట్లో ఉన్నా తప్పులేదు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు చెబుతున్నది మన సంక్షేమం కోసమని గ్రహించండి పాటించండి ఇతరులకు బోధించండి’ అంటూ విజయశాంతి పిలుపు ఇచ్చింది. 


అయితే ప్రభుత్వాలు హెచ్చరికలు చేస్తున్నా విజ్ఞప్తులు చేస్తున్నా పట్టించుకోని సాధారణ ప్రజానీకం విజయశాంతి మాటలకు ఎంతవరకు విలువ ఇస్తారు అన్నది సమాధానం లేని ప్రశ్న. ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ తరువాత మీడియాకు దూరంగా వెళ్ళిపోయిన విజయశాంతి ఇప్పుడు కరోనా సమస్య వంకతో తిరిగి మీడియా ద్వారా తన ఉనికి చాటుకోవడానికి ప్రయత్నిస్తోంది. 


ప్రస్తుతం దేశం ఎదుర్కుంటున్న ప్రధాన సమస్య ప్రజలను రోడ్డు పైకి రాకుండా చేయడం 130 కోట్ల జనాభా గల భారత్ లో ప్రజలను కట్టడి చేయడం అంత సులువైన విషయం కాదు. వాట్సాప్ లో క్షణానికి ఒక నెగిటివ్ వార్తలు కరోనా గురించి హడావిడి చేస్తున్న పరిస్థితులలో ఈ నెగిటివ్ వార్తల ప్రభావం నుండి ప్రజలను రక్షించడమే ఒక ప్రధాన సమస్యగా మారింది. రానున్న రెండు వారాలు మనదేశంలో అత్యంత కీలకం కానున్న పరిస్థితులలో ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలని చెపుతున్నా భాగ్యనగరంలో అనేక చోట్ల యూత్ మోటర్ సైకిల్ పై త్రిబుల్స్ రైడింగ్ చేస్తూ ఖాళీ రోడ్లను చూసి ఆనంద పడిపోతు గాలిలోకి తమ బైక్ ను పైకి లేపుతూ మోటర్ సైకిల్ రేసింగ్ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితులు చూసే వారికి భారత్ పరిస్థితి ఏమిటి అన్న సందేహాలు కలగడం వాస్తవం..  

మరింత సమాచారం తెలుసుకోండి: