సోషల్ మీడియా సెలెబ్రిటీలని సామాన్య జనాలకి చాలా దగ్గర చేసింది. తమ అభిప్రాయాలను పంచుకోవడానికి, ఎప్పటికప్పుడు జనాలకి దగ్గరగా ఉండడానికి బాగా దోహదపడుతుంది. అయితే సోషల్ మీడియా వల్ల సెలెబ్రిటీలు ఎంత మేలు పొందుతున్నారో అంతకన్నా ఎక్కువ ట్రోలింగ్స్ కి గురవుతున్నారు. తమకి నచ్చనిది చేసిన హీరోయిన్ల గురించి గానీ, తమ అభిమాన నటుడికి పోటీగా ఉన్న హీరో గురించి విపరీతంగా ట్రోల్స్ చేస్తుంటారు.

 

 


ఈ ట్రోల్స్ ని తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. చాలా సార్లు ఈ ట్రోలింగ్స్ పై హీరోయిన్లు సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ కి కంప్లైంట్స్ వెళ్తూనే ఉంటాయి. తెలుగులో ఇలా ట్రోలింగ్స్ ఎక్కువగా ఎదుర్కొనే వారిలో యాంకర్లు కూడా ఉన్నారు. జబర్దస్త్ ప్రోగ్రామ్ యాంకర్ గా వ్యవహరిస్తున్న అనసూయ, రష్మీలపై కుడా ట్రోలింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. ఆమె డ్రెస్సింగ్ మీదా,  ఇంకా సినిమాల్లో ఆమె నటించే పాత్రల మీద ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో విమర్శలు వస్తూనే ఉంటాయి.

 

 

కరోనా వైరస్ వల్ల దేశమంతా లాక్ డౌన్ ఉన్న నేపథ్యంలో ప్రతీ ఒక్కరు అవస్థలు పడుతున్నారు. అందరూ ఇళ్లలోనే ఉండిపోవడంతో ఉత్పత్తి పూర్తిగా తగ్గిపోయింది, మరికొన్ని రోజులు ఇలానే ఉంటే పరిస్థితి మరింత దిగజారుతుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో జనాలు ఇళ్లలోనుండి బయటకి వెళ్ళకపోవడంతో వీధి తిరిగే కుక్కలకి ఆహారం లేకుండా పోయింది. వాటిని పట్టించుకునేవారు కూడా కరువయ్యారు.

 

తాజాగా ఒక స్వఛ్ఛంద సంస్థ ఈ కుక్కలకి ఆహారాన్ని తెచ్చి పెట్టింది. ఆ స్వచ్చంద సంస్థ చేస్తున్న సాయంలో రష్మీ కూడా చేయి కలిపి రోడ్డు మీదకి వచ్చి బకెట్ నిండా ఆహారాన్ని తీసుకుని వచ్చి కుక్కలకి పంచి పెడుతూ కనిపించింది. దీంతో ఆమెపై ఇంతకుముందు సెటైర్లు వేసిన వాళ్లు కూడా రష్మీ చేసిన పనికి ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి దీంతో ఇకనైనా ఆమైపై ట్రోలింగ్ చేసేవాళ్ళు ఊరుకుంటారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: