తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న పెద్ద నిర్మాణ సంస్థల్లో గీతా ఆర్ట్స్ బ్యానర్ కు ప్రత్యేక స్థానం ఉంది. మగధీరతో తెలుగులో ఓ సినిమాకు 40కోట్లు పైగా బడ్జెట్ పెట్టొచ్చని మొదటిసారి నిరూపించిన సంస్థ గీతా ఆర్ట్స్. ఈ సంస్థ అధినేత అల్లు అరవింద్ ఆమధ్య భారీ బడ్జెట్ తో రామాయణం తెరకెక్కించేందుకు ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. కొన్నాళ్లుగా ఈ ప్రాజెక్టుపై న్యూస్ అప్డేట్స్ ఏమీ లేవు. ఈ ప్రాజెక్ట్ పై ఇప్పుడు ఓ ఆసక్తికరమైన న్యూస్ రౌండ్ అవుతోంది.

 

 

ఈ సినిమాను 1000 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కించాలని భావించాడని ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి. ఏమైందో కానీ ఈ ప్రాజెక్టుపై ఎటువంటి న్యూస్ రాలేదు. దీంతో ప్రాజెక్ట్ ఆగిపోయిందనే అనుకున్నారు. కానీ ఇండస్ట్రీలో రౌండ్ అవుతున్న లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ ప్రాజెక్టు ఆగిపోలేదట. ప్రస్తుతం ఇండియాలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఈ సినిమా గురించి ఆలోచిస్తాడట. ఆర్ఆర్ఆర్ జరిపే బిజినెస్, కలెక్షన్స్, క్రియేట్ చేసే ఇంపాక్ట్ ను బట్టి సహచర నిర్మాతలతో కలిసి నిర్ణయం తీసుకుంటాడట. ఈ వార్తపై పూర్తి అఫిషియల్ న్యూస్ రివీల్ కావాల్సి ఉంది.

 

 

నిజానికి అల్లు అరవింద్ రామాయణాన్ని లార్జ్ స్కేల్ లో తెరకెక్కించాలని ప్లాన్ వేశాడు. మ‌ధు మంతెన‌, న‌మిత్ మ‌ల్హోత్రా అనే మ‌రో ఇద్దరు నిర్మాత‌ల‌ సహకారంతో రామాయ‌ణంను 3డిలో నిర్మించ‌డానికి సిద్ధమ‌య్యాడు. రామాయణంను మూడు భాగాలుగా, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కించాలనేది అల్లు అరవింద్ ప్లాన్. మెగాస్టార్ చిరంజీవి నుంచి పవన్, రామ్ చరణ్, బయటి హీరోలతో అనేక బ్లాక్ బస్టర్లు తీసిన ఘనత అల్లు అరవింద్ సొంతం. రామాయణంపై ఫుల్ న్యూస్ రావాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: