టాలీవుడ్ నటుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ లో హీరోగా నటిస్తున్న విషయం తెలిసందే. యువ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని గతంలో హిందీ లో అమితాబ్ బచ్చన్ హీరోగా తెరకెక్కిన పింక్ మూవీ కి అధికారిక తెలుగు రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మొదటి సినిమా నుండి ఒక్కో సినిమాతో ఒక్కో విజయాన్ని అందుకంటూ ముందుకు సాగారు. అయితే సరిగ్గా జానీ సినిమా నుండి పవన్ కెరీర్ లో కొంత ఒడిదుడుకులు మొదలయ్యాయి. 

IHG

కాగా ఆ తరువాత మధ్యలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన జల్సా సినిమా మంచి విజయాన్ని అదనుకున్నప్పటికీ పవన్ ఫ్యాన్స్ లో మాత్రం ఆయన నుండి ఇంకా ఏదో కావాలనే అసంతృప్తి మాత్రం కొంత నెలకొని ఉంది. ఇక ఆ తరువాత 2012లో యువ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా ఒక్కసారిగా అత్యద్భుత విజయాన్ని అందుకొని అప్పట్లో పెద్ద సంచలన రికార్డుని నమోదు చేయడం తో పాటు, ఎన్నో ఏళ్ళ నుండి మాంచి ఆకలిగా ఉన్న ఆయన ఫ్యాన్స్ కు ఆ సినిమా ఫుల్ మీల్స్ ని అందించింది అనే చెప్పాలి. దానిని బట్టి పవన్ కు సరైన సినిమా పడితే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో అది గబ్బర్ సింగ్ ద్వారా టాలీవుడ్ కి మరొక్కసారి నిరూపితం అయింది. 

IHG

ఇక ఇటీవల కూడా వరుసగా పరాజయాలతో దూసుకెళ్తున్న పవన్, ప్రస్తుతం వకీల్ సాబ్ లో నటిస్తున్నప్పటికీ, ఆ సినిమా కొంత మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా కావడం, అలానే దాని తరువాత క్రిష్ దర్శకత్వంలో ఆయన చేస్తున్న సినిమా పీరియాడికల్ డ్రామా మూవీ కావడంతో అవి ఎంతవరకు పెద్ద సక్సెస్ అందుకుంటాయి అనే దానిపై పవన్ ఫ్యాన్స్ లో కొంత సందేహం ఉంది. అయితే ఆ రెండు సినిమాల అనంతరం మరొక్కమారు పవన్ సినిమాకి హరీష్ దర్శకత్వం వహిస్తుండడం, ఆ సినిమా తాలూకు ప్రకటన ఇటీవల రావడంతో మళ్ళి వీరిద్దరి కాంబోలో మరొక గబ్బర్ సింగ్ రేంజ్ సినిమాని ఆశిస్తున్నారు ఫ్యాన్స్. మరి ఆ సినిమాతో పవన్ కు ఎంతమేర సక్సెస్ ని హరీష్ అందిస్తారో చూడాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: