చిత్రపరిశ్రమలోకి కొత్త కొత్త హీరోయిన్స్ ఎంతోమంది వస్తారు.. కానీ అందులో కొందరు మాత్రమే సక్సెస్ అవుతారు.. మరికొంత మంది హీరోయిన్స్ తెరపై నిలదొక్కుకోవాలంటే ఎంతగానో శ్రమించవలసి వస్తుంది.. చాలా కాలం నిరీక్షించవలసి వస్తుంది.. కానీ అతి తక్కువ కాలంలోనే హీరోయిన్‌గా రాణించి మంచి అవకాశాలను అందిపుచ్చుకున్న వారు చాలా తక్కువ మంది ఉంటారు.. అంలాటి వారిలో రష్మిక మందన్న ఒకరని చెప్పవచ్చు.. 2016 లో కన్నడ సినిమా ద్వార చిత్రరంగ ప్రవేశం చేయగా, 2018 లో ఛలో' సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమైన రష్మిక, రెండవ సినిమాతోనే భారీ హిట్ అందుకుంది.. ఆ సినిమానే 'గీత గోవిందం'...

 

 

ఈ చిత్రం విజయ్ దేవరకొండతో పాటుగా రష్మిక కు కూడా అభిమానుల్లో చాలా క్రేజ్ సంపాదించి పెట్టింది.. ఇక ఈ సినిమాతో రష్మిక ఓవర్‌నైట్ స్టార్ హీరోయిన్ అయ్యింది.. ఇలా ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్దిరోజులకే ఆ స్టేటస్ ని దక్కించుకున్న రష్మిక. తాను నటించిన ప్రతీ సినిమా హిట్ అవుతుండడంతో లక్కీ గర్ల్ అని ముద్రవేయించుకుంది.. ఇకపోతే ఈ సంవత్సరం రష్మిక నటించిన రెండు చిత్రాలు.. సరిలేరు నీకెవ్వరు, భీష్మ మంచి విజయాలని సాధించాయి. అయితే హీరోయిన్ కి స్టార్ స్టేటస్ తెచ్చేది కమర్షియల్ చిత్రాలే. నటన పరంగా పర్ఫార్మెన్స్ పీక్స్ లో ఉన్నా కూడా వారిని గ్లామర్ డాల్స్ గా చూడడం వల్లేనేమో కమర్షియల్ చిత్రాలే డబ్బునీ, పేరునీ తీసుకొస్తాయి. ఈ ఫార్ములా వల్లనేమో ప్రతీ హీరోయిన్ తన ఫస్ట్ ఛాయిస్ గా కమర్షియల్ చిత్రాలనే ఎంచుకుంటుంది.

 

 

అయితే ఇలా ఎన్ని కమర్షియల్ చిత్రాల్లో నటించినా.. ఒక రియలిస్టిక్ సినిమాలో నటించాలని కోరుకోని వారుండరు.. ఇలాంటి అవకాశమే రష్మిక తలుపుతడితే వద్దని గడప బయట నుండే పంపేసిందట.. అదేమంటే తెలుగులో విజయం సాధించిన జెర్సీ చిత్రంను షాహిద్ కపూర్ హీరోగా, హిందీలో నిర్మిస్తుండగా ఈ సినిమాలో రష్మికని హీరోయిన్ గా నటించమని అడిగితే రిజెక్ట్ చేసిందట. కాగా ఏ హీరోయిన్ అయినా బాలీవుడ్ సినిమాలో అవకాశం వస్తే అసలు వదులుకోరు..

 

 

కానీ రష్మిక ఆ చిత్రాన్ని కాదనడానికి కారణం ఏంటంటే. జెర్సీ రియలిస్టిక్ చిత్రం కావడం వల్లే తాను అందులో నటించనని చెప్పిందనే టాక్ ఇండస్ట్రీలో ఉంది.. ఏది ఏమైన బాలీవుడ్‌లో కుడా తమ హీరోయిన్ నటిస్తే చూడాలనుకున్న అభిమానులకు రష్మిక నిరాశే మిగిల్చింది.. ఈ విషయంలో రష్మిక ఇలా ప్రవర్తిస్తుందని అసలు ఊహించలేదని అభిమానులు అనుకుంటున్నారట.. ఇకపోతే కమర్షియల్ సినిమాల్లో తప్ప రియలిస్టిక్ సినిమాల్లో రష్మిక నటించనని తెలిపిందట.. 

మరింత సమాచారం తెలుసుకోండి: