మెగాస్టార్ చిరంజీవి చిరంజీవి ఎన్నో రొమాంటిక్ సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతో మెప్పించారు. అయితే ఆయన వెండితెర పై లవ్ స్టోరీలు నడిపించాడు పాటు జీవితంలో కూడా ఎవరి వెంటయినా పడి లవ్వులు గట్రా చేశారా అనేది ఓ ఆసక్తికరమైన అంశం అని చెప్పుకోవచ్చు. అయితే తాను ఒక అమ్మాయి ని బాగా ఇష్టపడ్డాడు కానీ తన ఇష్టం పెళ్లి వరకు మాత్రం పోలేదని మెగాస్టార్ గురించి ఒక కథ అప్పట్లో హల్ చల్ చేసింది. 

 


ఆ నిజమైన సంఘటన గురించి చెప్పుకుంటే... కెరీర్ తొలినాళ్ళలో చిరంజీవి చెన్నై లోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ కోర్స్ తీసుకుంటుండేవాడు. ఆ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ సమీపంలో ఓ చిన్నపాటి హోటల్ ఉండేది. అయితే ఆ హోటల్ ఓనర్ కూతురైన ఓ అమ్మాయి చిరంజీవి వైపే చూస్తూ ఉండేది. మొదటిలో లైట్ గా తీసుకున్న చిరు...రోజులు గడుస్తున్న కొద్దీ ఆమె ప్రవర్తనలో చాలా తేడా గమనించాడు. ఆమె ఫిలిం ఇన్స్టిట్యూట్ ముందు నుండి ప్రతిరోజు వెళుతూ అతని వైపే చూస్తూ కొంటెగా నవ్వుతూ వయ్యారాలు ఒలికించేదట. దాంతో కాలక్రమేణా చిరంజీవి కూడా ఆమెకి ఆకర్షితుడయ్యాడు. ఆ తర్వాత తాను కూడా ఆమె స్పందనలకు ప్రతిస్పందనగా చిరునవ్వు నవ్వేవాడట. 

 


దాంతో ధైర్యం తెచ్చుకున్న సదరు యువతి తన హోటల్ కి రమ్మని చేతులతో సైగ చేస్తూ చిరంజీవి కి చెప్పిందట. షాక్ అయిన చిరంజీవి ఆపై తేరుకొని ఆమెను అనుసరిస్తూ హోటల్ వద్దకు వెళ్ళగానే... ఆ యువతి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి పోయిందట. ఏమి అర్థం కాని చిరంజీవి అక్కడే నిలబడగా... హోటల్ లోపలనుండి మహిళా ఓనర్ వచ్చి 'అమ్మాయి నీ గురించి చెప్పింది. నువ్వు నన్ను పెళ్లి చేసుకున్న ఓకే. మా అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఓకే. ఇద్దరిలో ఎవరిని చేసుకున్న ఈ హోటల్ మొత్తం నీకే', అంటూ విచిత్రమైన బంపర్ ఆఫర్ ఇచ్చి సిగ్గుతో తలదించుకుందట. దాంతో... " ఓరినాయనో, వీళ్ళేం తల్లీకూతుళ్లు, రా బాబు!!" అనుకుంటూ అక్కడి నుండి ఇన్స్టిట్యూట్ వచ్చేంతవరకు తెగ పరిగెత్తాడట. ఆ తర్వాత తన రూం నుండి ఒక్క రోజు కూడా బయటికి రాలేదట. ఒకవేళ చిరంజీవి ఆ యువతిని పెళ్లి చేసుకున్నట్లైతే... ఆయన జీవితం ఎలా ఉండేదో ఊహించడానికే చాలా కష్టంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: