కరోనా నుంచి తప్పించుకోవడానికి ప్రస్తుతం అందరు లాక్ డౌన్ పాటిస్తున్న నేపధ్యంలో అమెజాన్ నెట్ ఫ్లిక్స్ లోని సినిమాలను మాత్రమే కాకుండా యూట్యూబ్ లో ఇప్పటికే అప్ లోడ్ అయిన అనేక పాత సినిమాలను కూడ జనం చూస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా మరికొందరైతే కొన్ని పాత సినిమాలను చూసి ఆసినిమాలోని పలానా సీన్ మరొక పాత సినిమాకు కాపీ అంటూ కామెంట్స్ చేస్తూ ఆసినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకులను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.

 

ఇప్పుడు ఈసెగ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు బాగా తగులతోంది. గతంలో రాజమౌళి తాను ఏసినిమా సీన్ ను కాపీ కొట్టను అని కేవలం సీన్ ప్రేరణ మాత్రమే తీసుకుంటాను అంటూ చెప్పిన విషయం తెలిసిందే. అదేవిధంగా త్రివిక్రమ్ కూడ చేసేది కాపీ కాదని త్రివిక్రమైజేషన్ అని కొంతమంది నెటిజన్లు త్రివిక్రమ్ కాపీ అనుసరణకు ఒక కొత్త పదాన్ని క్రియేట్ చేసారు. 

 

వాస్తవానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ప్రతి సినిమాకు దాదాపుగా  ఏదో ఒక సినిమా కాపీ అంటూ గతంలో విమర్శలు వచ్చాయి. ‘అ ఆ’ యద్దనపూడి ‘మీనా’ కథకు అనుసరణ అయితే ‘అజ్ఞాతవాసి’ ఫ్రెంచ్ మూవీ ‘లార్గో వించ్’ కాపీ అంటూ గోల జరిగింది. లేటెస్ట్ గా వచ్చిన ‘అల వైకుంఠపురములో’ మూవీ కథ పై కూడ అనేక కాపీ వివాదాలు నడిచాయి. ఇప్పుడు ఇది చాలదు అన్నట్లుగా ఎప్పుడో వచ్చిన మహేష్ ‘ఖలేజా’ సినిమాలో ఒక సీన్ ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాలో మరొక సీన్ కొన్ని సినిమాల సీన్స్ కాపీ అంటూ మళ్ళీ త్రివిక్రమ్ పై కాపీ బురద జల్లుతున్నారు. 

 

వాస్తవానికి ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాకు త్రివిక్రమ్ రచయిత మాత్రమే. దీనితో కొంతమంది ‘త్రివిక్రమైజేషన్’ అంటూ సెర్చ్ చేస్తే చాలు త్రివిక్రమ్ ప్రేరణలు అన్ని అందులోనే కనిపిస్తాయని అంటూ హడావిడి చేస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో కూడ త్రివిక్రమ్ కు ఇలా కాపీ మరకలు అంటుతూ ఉండటం ఒకవిధంగా త్రివిక్రమ్ కు షాక్ ఇచ్చే విషయం..  

మరింత సమాచారం తెలుసుకోండి: