మరొక వారం రోజుల్లో కేంద్ర ప్రభుత్వం పొడిగించిన లాక్ డౌన్ ముగిసిపోతుంది. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా లాక్ డౌన్ ను మరొక నెల రోజులు కొనసాగిస్తే మేలని సూచనలు వినిపిస్తున్నాయి. అయితే వాస్తవం ఏమిటంటే భారతదేశంలో కరోనా అందరూ ఊహించినంత భయానకంగా అయితే విస్తరించడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. రోజురోజుకి కేసులు పెరుగుతునా.. సరిగ్గా నిబంధనలు పాటించి కొన్ని స్పష్టమైన మరియు ఆలోచనాత్మకమైన నిర్ణయాల ద్వారా కేసులను ఎలా గణనీయంగా తగ్గించవచ్చో కేరళ ప్రభుత్వం ఇప్పటికే చేసి చూపించింది.

 

 

అదీ కాకుండా మిగతా దేశాలతో పోల్చి చూసుకుంటే కరోనా వ్యాప్తి శాతం కానీ కరోనా వల్ల మరణాల రేటు కానీ మనదేశంలో చాలా తక్కువగా ఉందని కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా ప్రకటనలు చేస్తూ ఉంది. కాబట్టి పరిస్థితి ఇలా ఉండగా జాతీయ మీడియా ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతోంది. మే 3 తర్వాత దశలవారీగా లాక్ డోన్ నుంచి మినహాయింపు ఉండవచ్చు. ఇప్పటికే కరోనా ప్రభావం గురించి కేంద్రం ఒక అంచనాకు వచ్చేసిందని మేరకు దశలవారీగా ఎత్తివేసేందుకు ఆలచన చేస్తోందని వినిపిస్తూ ఉంది.

 

దీనికి సంబంధించి కేంద్రం ఇప్పటికే ఒక ఆలోచన లో ఉండగా ఏప్రిల్ 30 తర్వాత వారు ఏదో ఒక విషయాన్ని ప్రజలకు స్పష్టం చేస్తారట. ఇప్పటికే నిత్యావసర వస్తువులు షాపులతో పాటు మిగతా వాటిని కూడా తెరుచుకోమని కేంద్రం ఇచ్చిన ఆదేశాలను చూస్తుంటే ప్రజల కోసం గుడ్ న్యూస్ వేచి ఉన్నట్లే.

 

ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి మాత్రం చాలా గందరగోళంగా తయారైంది. గత రెండు రోజుల్లో రాష్ట్రంలో కేసులు భారీగా పెరిగిపోగా అటు రికవర్ అవుతున్న వారి సంఖ్య కూడా మాత్రం ముందుకు కదలడం లేదు. దీంతో నెలాఖరుకు దేశమంతా పరిస్థితి ఎలా ఉన్నా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఎటువంటి లాక్ డౌన్ ఉల్లంఘనలు సడలించే పరిస్థితి అయితే లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: