తెలుగు సినిమా చరిత్రలో తన ఆకట్టుకునే అందం, అభినయంతో మహానటిగా ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న నటి ఎవరంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే పేరు సావిత్రి. ఒకప్పుడు సినిమాల్లో సావిత్రి కనపడితే చాలు, అటువంటి అమ్మాయి మా కోడలో లేక మా కూతురో అయితే బాగుండు అని అప్పటి ప్రేక్షకులు భావించేవారు అంటే వారి మనసులో సావిత్రి వేసిన ముద్ర ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు. ముందుగా 1952 లో వచ్చిన పెళ్లి చేసి చూడు సినిమాలో ఒక పాత్రలో నటించిన సావిత్రి, ఆ తర్వాత అదే ఏడాది తమిళ్ లో వచ్చిన కళ్యాణం పన్నీ పర్ సినిమాలో కూడా నటించారు. 

 

అనంతరం తెలుగులో పల్లెటూరు, ప్రియురాలు, శాంతి, సంక్రాంతి, దేవదాసు, ప్రతిజ్ఞ ఇలా చెప్పుకుంటూపోతే పలు సక్సెస్ఫుల్ చిత్రాల్లో అప్పట్లో నటించిన సావిత్రి, ఆపై టాలీవుడ్ లెజెండరీ నటులైన ఎన్టీఆర్, ఏఎన్నార్ల సరసన పలు సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటించి మంచి పేరు గడించారు. ముఖ్యంగా ఆమె నటించిన సినిమాల్లో గుండమ్మ కథ, మాయాబజార్, రక్తసంబంధం, తోడికోడళ్ళు, కలసిఉంటే కలదుసుఖం, మాంగల్యబలం, ఇంటిగుట్టు, నర్తనశాల వంటి సినిమాలు సావిత్రి కి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. ఏదైనా సినిమాలో సావిత్రి ఉంది అంటే చాలు, ఆమె కోసమే తెలుగు ప్రేక్షకులు ఎగబడి వచ్చేవారు అంటే సావిత్రి కున్న క్రేజ్ ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు. 

 

ఆ విధంగా ఒక్కోసినిమాతో ఎంతో గొప్ప పేరు గడిస్తూ ముందుకు సాగిన సావిత్రి, కొన్నాళ్ల తర్వాత అప్పటి తమిళ హీరో జెమిని గణేషన్ ను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత మెల్లగా కుటుంబ సమస్యల వలన మద్యానికి బానిసైన సావిత్రి, ఆపై అనారోగ్యం పాలయ్యారు. అనంతరం తన 45 ఏళ్ల వయసులోనే మనందరినీ విడిచి ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఇప్పటికి సావిత్రి మరణించి దాదాపుగా 40 ఏళ్లకు పైగా అవుతున్నప్పటికీ కూడా, తెలుగు సినిమా అనేది బ్రతికి ఉన్నంతకాలం సావిత్రి పేరు మహానటిగా చిరస్థాయిగా మన ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయే ఉంటుంది అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు......!!

మరింత సమాచారం తెలుసుకోండి: