ఇంపాజిబుల్ మిషన్స్ ను పాజిబుల్ గా మలిచే టామ్ క్రూస్ మరో సాహసానికి సిద్ధమయ్యాడు. ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ దర్శకుడికి, నిర్మాతకు రాని ఆలోచనతో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు టామ్ క్రూజ్. భూమి, ఆకాశానికి మధ్యలో సినిమా తియ్యాలనుకుంటున్నాడు టామ్ క్రూస్. 

 

రియలిస్టిక్ అడ్వెంచర్స్ తో జనాలను ఇంప్రెస్ చేస్తోన్న టామ్ క్రూస్, ఇప్పుడో ఎక్స్ పరిమెంట్ కు సిద్ధమయ్యాడు. మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ లో బోల్డన్ని స్టంట్లు చేసి ప్రపంచాన్ని కాపాడుతోన్న టామ్ క్రూస్, ఇప్పుడు ప్రపంచ రికార్డ్ క్రియేట్ చేసేందుకు బయల్దేరుతున్నాడు. భూమి ఆకాశానికి మధ్య ఉన్న స్పేస్ లో ఓ సినిమా షూట్ చేయాలనుకుంటున్నాడు టామ్ క్రూస్. 

 

స్పేస్ ఎక్స్ ఫౌండర్ ఇలాన్ మస్క్ తో కలిసి సంప్రదింపులు జరుపుతున్నాడట టామ్ క్రూస్. ఇప్పటి వరకూ అందరూ భూమిపైనా.. నీళ్లపైనా సిినిమాలు తీశారు. కానీ ఎవరూ స్పేస్ లో షూటింగ్ లు చేయలేదు. అయితే టామ్ క్రూస్ మొదటిసారిగా స్పేస్ లో సినిమా తీయాలనే ఆలోచనలో ఉన్నాడట. భూమి నుంచి 50కిలోమీటర్ల పై ఉన్న స్ట్రాటోస్పియర్ సినిమా షూటింగ్ కు నాసాతో సంప్రదింపులు జరపాలనుకున్నాడట టామ్ క్రూస్.  

 

టామ్ క్రూస్ ఆలోచనలు చాలా క్రేజీగా ఉన్నాయి గానీ.. హాలీవుడ్ ప్రొడక్షన్ హౌసెస్ ఏవీ టామ్ ఆలోచనపై పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపించడం లేదట. అయితే టామ్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఎలాగైనా స్పేస్ లో ఓ సినిమా తియ్యాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇక టామ్ గనుక ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తే.. ప్రపంచంలోనే స్పేస్ లో షూటింగ్ జరుపుకున్న మొట్టమొదటి సినిమాగా రికార్డ్ క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు. మొత్తానికి టామ్ క్రూస్ ప్రపంచ రికార్డ్ సృష్టించబోతున్నాడు. స్పేస్ లో సినిమా తీయాలనుకుంటున్న టామ్ అందులో ఎలా సక్సెస్ అవుతాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: