జాక్వెలిన్ ఫెర్నాండేజ్ క్వారంటైన్ ని ఫుల్ గా సద్వినియోగం చేసుకుంటోంది. అనుకోకుండా వచ్చిన ఈ బ్రేక్ ను కొంచెం అడ్వెంచరస్ గా లీడ్ చేస్తోంది. సల్మాన్ ఖాన్ ఫామ్ హౌజ్ లో చెట్లు ఎక్కుతూ.. గుర్రపు స్వారీలు చేస్తూ వైల్డ్ గా గడిపేస్తోంది జాక్వెలిన్. 

 

జాక్వెలిన్ ఫెర్నాండేజ్ క్వారంటైన్ పీరియడ్ ను చాలా వైరల్డ్ గా ఎక్స్ పీరియన్స్ చేస్తోంది. ఎప్పుడూ షూటింగ్ లు, ప్రమోషన్లతో బిజీగా ఉండే జాక్వెలిన్, ఈ బ్రేక్ టైమ్ ను తనకు నచ్చినట్టుగా వాడుకుంటోంది. ముంబయి కాంక్రీట్ జంగిల్ కు దూరంగా సల్మాన్ ఖాన్ ఫామ్ హౌజ్ లో ఉంటోన్న జాక్వెలిన్, ఇక్కడ బోల్డన్ని సాహసాలు చేస్తోంది. కొబ్బరి చెట్లు ఎక్కడం నేర్చుకుంటోంది. గుర్రపు స్వారీలు చేస్తోంది. మొత్తంగా నేచర్ తో మమేకమైపోతోంది. ఈ నేచర్ జర్నీని అభిమానులతో పంచుకుంటోంది. 

 

జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఈ లాక్ డౌన్ పీరియడ్ లో సల్మాన్ ఖాన్ ఫామ్ హౌజ్లో లాక్ అయిపోయింది. వీకెండ్ హాలిడే కోసం సల్మాన్, అతని చెల్లెలు అర్పితా ఖాన్ శర్మ, అర్పితా భర్త ఆయుష్ శర్మ, సల్మాన్ మాజీ గర్ల్ ఫ్రెండ్ మోడల్ యులియా వెంటార్ తో కలిసి ఫామ్ హౌజ్ కు వెళ్లింది జాక్వెలిన్. అయితే ఆ రోజు నుంచే లాక్ డౌన్ విధించడంతో ఫామ్ హౌజ్ లోనే ఉండిపోయింది. 

 

జాక్వెలిన్ ఫెర్నాండేజ్ సిటీకి, తన స్టాఫ్ కు దూరంగా ఉంటోన్నా ఏ మాత్రం బాధపడటం లేదు. ఎలాగూ పేరెంట్స్ శ్రీలంకలో ఉన్నారు. ఇక ముంబయిలో ఒక్కతే ఉండటం కంటే.. ఫ్రెండ్స్ తో కలిసి సల్మాన్ ఖాన్ కు జంగిల్ లో ఉండటమే బెటర్ అనుకుంటోంది. 250ఎకరాల్లో ఉన్న ఈ ఫామ్ హౌజ్ జంతువులు పక్షులతో చిన్నపాటి అడవిలా ఉంటుంది. దీంతో నేచర్ కు దగ్గరగా ఉంటున్నాననీ.. తెగ సంబరపడిపోతోంది జాక్వెలిన్. 

మరింత సమాచారం తెలుసుకోండి: