టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకునే హీరోలు కొందరు ఉన్నారు. అందులో అల్లు అర్జున్ ఒకరు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా సరే ఎక్కడా కూడా మెగా ఫ్యామిలీ ఇమేజ్ ని అతను వాడుకున్న సందర్భం లేదు. తొలి సినిమా ఆ తర్వాత చేసిన సినిమాలు ఒకటో రెండో అతనికి మెగా ఫ్యామిలీ హీరో అనే పేరు తీసుకుని వచ్చాయి గాని ఎక్కడా కూడా అతను మాత్రం తనకు ఉన్న ఇమేజ్ ని వాడుకుని పైకి రావాలని అనుకోలేదు. తండ్రి అగ్ర నిర్మాత అయినా మావయ్య అగ్ర హీరో అయినా సరే అతను ఎప్పుడు కూడా వాళ్ళను వాడుకునే సాహసం కూడా చేసిన సందర్భం అనేది లేదు అనేది వాస్తవం. 

 

అతని కథల నుంచి సినిమాల ఎంపిక వరకు అన్నీ కూడా పూర్తి భిన్నం గా ఉంటాయి. ఆర్య సినిమా నుంచే అతను ఇదే విషయాన్ని చెప్పాడు. ఎలాంటి ప్రయోగం చేయడానికి అయినా సరే అతను భయపడిన సందర్భం అనేది ఏ ఒక్క రోజు కూడా లేదు అనేది వాస్తవం. ఆ విధంగా అల్లు అర్జున్ తన సినిమా కెరీర్ లో పైకి వచ్చాడు అనేది వాస్తవం. ఇప్పుడు వరుసుగా సినిమా లు చేస్తున్నా సరే ఎక్కడా కూడా మెగా ఫ్యామిలీ ఇమేజ్ ని వాడుకోలేదు అనేది అందరికి తెలిసిన విషయమే. నేడు అతను కొన్ని సినిమాలు చేస్తున్నాడు. 

 

ఆ సినిమాలు అన్నీ కూడా ప్రత్యేకంగా ఉంటాయి. అల వైకుంఠపురములో సినిమా చూస్తే ఇదే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఆ సినిమాలో అతని నటన కు గాని అతని డాన్స్ కి గాని మంచి మార్కులు పడ్డాయి. ఏ సినిమా లో అయినా సరే అతని డాన్స్ కి మంచి మార్కులు పడుతూ ఉంటాయి అనేది వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: