తెలుగు ఇండస్ట్రీలో విడుదల కానున్న సినిమాలలో హీరో నాని నటించిన వీ భారీ సినిమా అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో నాని, సుధీర్, నివేదా థామస్, అదితీరావ్ హైదరీ ప్రధాన పాత్రలో నటించగా... మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించాడు. ఫిలిం ప్రొడ్యూసర్ దిల్ రాజు తన సొంత బ్యానర్ శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కింద వీ సినిమాని 40 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించాడు. అయితే ఇంత బడ్జెట్ తో తీసిన ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయితేనే ప్రేక్షకులకి మంచి అనుభూతి లభిస్తుందని దిల్ రాజు తో పాటు హీరో నాని కూడా భావించారు. లాక్ డౌన్ మహా అంటే నెలరోజుల్లో ఎత్తివేస్తారు... మన మూవీ ఖచ్చితంగా మూవీ థియేటర్స్ లోనే విడుదల కావాలని నాని కూడా పట్టుపట్టాడు.


కానీ 30 రోజుల వరకు మాత్రమే ఉంటుందనుకున్న ఈ లాక్ డౌన్... 55 రోజులు గడుస్తున్నా... ఇంకా ఎత్తివేయలేదు కానీ మే 31 వరకు పొడిగించారు. అప్పటివరకు సినిమా థియేటర్స్ ఓపెన్ చేసేందుకు అనుమతి లేదు. భారతదేశంలో రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే వస్తుంది కానీ తగ్గడం లేదు. దీన్ని బట్టి చూస్తే లాక్ డౌన్ అనేది ఇప్పట్లో ఎత్తి వేస్తారని అనుకోవడం తెలివి తక్కువ ఆలోచన గా చెప్పుకోవచ్చు. రోజులు గడుస్తున్న కొద్దీ దిల్ రాజు చేసిన అప్పులకు వడ్డీ విపరీతంగా పెరిగిపోతుంది. థియేటర్లు ఓపెన్ చేస్తారో లేదో తెలియక... ఒకవేళ ఓపెన్ చేసినా ప్రేక్షకులు థియేటర్ల కి వస్తారో లేదో కూడా తెలియని దిల్ రాజు తన సినిమాని ఎంతోకొంత డబ్బులకు అమ్మేసి పెరిగిపోతున్న తన వడ్డీ భారాన్ని తగ్గించుకోవాలని ఆలోచిస్తున్నాడు.


అందుకే ఏదైనా ఓటీటీ(OTT) ప్లాట్ ఫామ్ కి తన సినిమాని అమ్ముకోవాలని దిల్ రాజు ఓ పెద్ద చర్చ పెట్టి అనంతరం అల్లు అరవింద్ సొంతమైన సరికొత్త ఓటీటీ(OTT) ప్లాట్ ఫామ్ ఆహా కి అమ్మాలనే నిర్ణయానికి వచ్చాడు. ఐతే అల్లు అరవింద్ ఈ సినిమాని అందరూ ఊహించిన దానికంటే ఎక్కువ డబ్బులకి కొనుగోలు చేశాడని సమాచారం. ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరూ హాయిగా ఇళ్లలో కూర్చొని నెట్ ఫ్లిక్, అమెజాన్ ప్రైమ్ లాంటి ఓటీటీ(OTT) ప్లాట్ ఫామ్ లలో సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందుకే అల్లు అరవింద్ తనకంటూ ఒక ఓటీటీ(OTT) ప్లాట్ ఫామ్ ఉండాలనే ఉద్దేశంతో ఆహా యాప్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. కానీ ఈ ఓటీటీ(OTT) ప్లాట్ ఫామ్ విడుదలై చాలా నెలలు కావస్తున్నా... అంతగా పాపులారిటీని సంపాదించలేక పోయింది. ఒకవేళ తన ఆహా ప్లాట్ ఫాం లో గనుక మూడునాల్గు బడా హీరోల సినిమాలు విడుదలైతే పాపులారిటీ అదంతట అదే దన్నుకొస్తుందని అల్లు అరవింద్ భావిస్తున్నాడు. అందుకే దిల్ రాజు ని ఒప్పించి తన ఫ్లాట్ ఫాం లో నాని వీ సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేశాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: