స్టార్ డైరెక్టర్ స్టార్ హీరో కాంబినేషన్లో ఏదైనా సినిమా వచ్చింది అంటే ఇక అంతే అభిమానుల్లో ప్రేక్షకుల్లో భారీ అంచనాలే. కానీ కొన్ని కొన్ని సార్లు దర్శకుల క్యాలిక్యులేషన్ మాత్రం దెబ్బతింటుంది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్టవుతుంది అనుకుంటే సినిమా కాస్త డిజాస్టర్ గా మిగిలిపోతుంది. ఇలా జరిగిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఇలాంటి సినిమాలలో ఒకటే దమ్ము. ఎన్టీఆర్ కెరీర్లోనే ఎక్కువ అంచనాల మధ్యన విడుదల అయ్యింది దమ్ము సినిమా. మాస్ యాక్షన్ కు మారు పేరైన దర్శకుడు బోయపాటి శ్రీను... మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన హీరో జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాలను పెంచేసింది ప్రేక్షకుల్లో. 

 


ఎన్ని  అంచనాలను పెంచేస్తే ఏం లాభం ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ప్రేక్షకులను ఆకట్టుకోవాలి . కానీ అది మాత్రం చేయలేకపోయింది ఈ సినిమా. ఈ సినిమాలో  ఎన్టీఆర్ లుక్ ఎంతో అద్భుతంగా ఉన్నప్పటికీ... యాక్షన్ పరంగా కూడా ఈ సినిమా ఎంతగానో మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించినప్పటికీ... ఈ సినిమా స్టొరీ మాత్రం ప్రేక్షకులకు అంతగా మెప్పించలేకపోయింది. ఈ సినిమా స్టోరీలైన్ ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాకపోవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది అని చెప్పాలి. నిర్మాతలకు నష్టాలను తెచ్చిపెట్టింది.

 


 అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా వెండితెరపై ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయినప్పటికీ... బుల్లి తెరపై మాత్రం ఎంతగానో సత్తా చాటింది అనే చెప్పాలి. దమ్ము సినిమా ఎప్పుడు వచ్చినా ఎంతో ఆసక్తికరంగా చూస్తూ ఉంటారు బుల్లితెర ప్రేక్షకులు. ఈ సినిమా స్టొరీ లైన్ అంతగా బాగా లేకపోయినప్పటికీ ఈ సినిమాలోని ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రం సినిమా చూడాల్సిందే అంటూ ఉంటారు బుల్లితెర ప్రేక్షకులు. ఇలా వెండి తెరపై అంతగా ఆకట్టుకోలేక పోయినాప్పటికీ బుల్లి తెరపై మాత్రం సత్తా చాటింది ఈ సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి: