తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ కు ఎలా వీరాభిమానులు ఉన్నారో భారత దేశ వ్యాప్తంగా ఆమిర్ ఖాన్ కి కూడా అదే స్థాయిలో వీరాభిమానులు ఉన్నారు. నిజం చెప్పాలంటే ఆమిర్ ఖాన్ కి బంగ్లాదేశ్, ఇరాన్, ఇరాక్, పాకిస్తాన్ వంటి దేశాల్లో కూడా అభిమానులు ఉన్నారు. త్రీ ఇడియట్స్, తారే జమీన్ పర్, లగాన్, పీకే, గజిని, ధూమ్ 3, దంగల్ సినిమాలలో ఆమిర్ ఖాన్ నటన చాతుర్యానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఫిదా అయిపోయారు. అద్భుతం గా నటించడం మాత్రమే కాదు అద్భుతంగా డ్యాన్స్ కూడా చేయగలడు ఆమిర్ ఖాన్. ఎంత ఛాలెంజింగ్ పాత్ర చేయడానికైనా తన పూర్తి డెడికేషన్ చూపించగల ఏకైక నటుడు ఆమిర్ ఖాన్. అందుకే అతడిని మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అని అభిమానులు పిలుస్తుంటారు. 


అతను నటించిన సినిమా ఏది రిలీజ్ అయిన సూపర్ హిట్ గా నిలవడం ఖాయమని చెప్పవచ్చు. కథ యావరేజ్ గా ఉన్నా పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా దాదాపు అన్ని హిట్స్ గానే నిలుస్తాయి. స్క్రిప్ట్ ఎంపిక చేసుకోవడంలో పవన్ కళ్యాణ్ విఫలమవడం వలన కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి కానీ ఆమిర్ ఖాన్ లాగా కథాబలం ఉన్న చిత్రాల్లో నటించినట్లయితే అతనికి భారత దేశ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు వచ్చేవి. ఏది ఏమైనా మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి  ఓ మంచి కథాబలం ఉన్న, రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించే సినిమాలో నటిస్తే అది ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని చెప్పవచ్చు. 


ఆమిర్ ఖాన్,  పవన్ కళ్యాణ్ స్నేహితులుగా నటిస్తే అభిమానులు పండగ చేసుకుంటారు అని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరి సరసన అనుష్క శర్మ, దీపికా పడుకొనే బాగా సెట్ అవుతారు. ఏ.ఆర్.రెహమాన్, హారిస్ జయరాజ్ ఈ సినిమా కోసం సంయుక్తంగా పనిచేస్తే వారి మ్యూజికల్ మ్యాజిక్ ని భారతీయ ప్రేక్షకులు ఎంజాయ్ చేయవచ్చు. మరి భవిష్యత్తులో అయినా వీరి కాంబినేషన్లో ఒక సినిమా రావాలని కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి: