రామ్ గోపాల్ వర్మ పవర్ స్టార్ మూవీకి విరుగుడు మంత్రంగా పవన్ కళ్యాణ్ అభిమానులు అనుసరిస్తున్న వ్యూహానికి అనూహ్య స్పందన వస్తోంది. సెప్టెంబర్ 2న వచ్చే పవన్ కళ్యాణ్ పుట్టినరోజున ముందుకు తీసుకువచ్చి ‘అడ్వాన్స్ హ్యాపీ బర్తడే పవన్ కళ్యాణ్’ అంటూ పవన్ అభిమానులు క్రియేట్ చేసిన హ్యాష్ ట్యాగ్ కు అనూహ్య స్పందన కొనసాగుతోంది.
ఈ హ్యాష్ ట్యాగ్ ప్రారంభించిన కేవలం 24 గంటలలో 27.౩ మిలియన్ ట్విట్స్ రావడమే కాకుండా లక్షలలో ఓట్లు పడ్డాయి. ఇప్పుడు ఇది ఇండియాలోనే ట్విటర్ ట్రెండింగ్ రికార్డుగా మారింది. ఈ హంగామా ఇలా ప్రతిరోజు కొనసాగితే పవన్ కళ్యాణ్ పుట్టినరోజునాటికి ఎన్ని మిలియన్ ల ట్విట్స్ సంఖ్యకు చేరుకుంటుందో ఎవరి అంచనాలకు అందడం లేదు.
వాస్తవానికి పవన్ కళ్యాణ్ ను ఒక దేవుడుగా ఆరాధించే అభిమానులు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఉన్నారు. అయినా గత ఎన్నికలలో పవన్ ‘జనసేన’ పార్టీకి 21 లక్షల ఓట్లు మాత్రమే రావడం కాకుండా పవన్ పోటీ చేసిన రెండు స్థానాలలోనూ ఓటమి చెందాడు. దీనితో పవన్ ను అభిమానించే అభిమానుల వీరాభిమానం ఓట్ల రూపంలో మారలేదా అన్న సందేహం అందరిలో ఉంటుంది.
అయితే నిశితంగా పరిశీలించిన వారికి మాత్రం ఇక్కడ ఒక చిన్న విషయం అంతర్లీనంగా కనిపిస్తుంది. పవన్ కు అభిమానులు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాలలో అదేవిధంగా వివిధ రాష్ట్రాలలో ఉన్నారు. దీనితో పవన్ కు సంబంధించి ఏ న్యూస్ బయటకు వచ్చినా అది క్షణాలలో వైరల్ అయిపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పవన్ అభిమానులు పవన్ కు సంబంధించిన న్యూస్ ను వైరల్ చేయడంలో తమ వంతు పాత్ర క్రియాశీలకంగా పోషించ గలుగుతున్నారు కాని పవన్ కు ఓట్లు వేయించలేకపొతున్నారు అన్న కామెంట్స్ వస్తున్నాయి. దీనితో పవన్ తన అభిమానుల మ్యానియాను ఓట్లుగా ఎలా మార్చుకోవాలి అన్న విషయమై దృష్టి పెట్టినప్పుడు మాత్రమే కనీసం వచ్చే ఎన్నికలకైనా పవన్ ‘జనసేన’ లక్ష్యాలు నెరవేరగలుగుతాయి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి