రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో
ఇండియా బాక్స్ ఆఫీస్ ఇండస్ట్రీ హిట్ కొట్టి ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సాధించాడు. ఆ
సినిమా ఏకంగా 1800 కోట్లు పైగా కలెక్షన్స్ రాబట్టి పెద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన ఈ
సినిమా అన్ని
ఇండస్ట్రీ ల లోను రికార్డు స్థాయిలో కలెక్షన్ లు సాధించి
బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ చిత్రానికి శోభూ
యార్లగడ్డ,
ప్రసాద్ దేవినేని కలిసి ఆర్కా
మీడియా బ్యానర్ పై నిర్మించారు. తర్వాత
సాహో సినిమా తీసుకొని మిక్స్డ్ టాక్ తో నే 400 కోట్లు రాబట్టాడు ప్రభాస్. ఈ చిత్రాన్ని రన్
రాజా రన్ ఫేమ్
సుజిత్ తెరకెక్కించాడు.
ఇక ఈ
సినిమా తరువాత
ప్రభాస్ జిల్ దర్శకుడు రాధా
కృష్ణ తో ఒక
లవ్ స్టోరీ చేస్తున్నాడు. ఈ సినిమాలో పూజ హెగ్దే
హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని యూ వీ క్రియేషన్స్ బ్యానర్ పై
ప్రభాస్ ఫ్రెండ్స్
వంశీ ప్రమోద్ లతో పాటు
ప్రభాస్ చెల్లెలు ప్రసీద కూడా కలిసి నిర్మిస్తుంది. ఈ
సినిమా దాదాపు షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఈ మధ్య వచ్చిన రాధే శ్యాం అనే టైటిల్, ఫస్ట్ లుక్ అభిమానులను ఎంత గానో ఆకట్టుకున్నాయి.


ఇక ఈ
సినిమా తర్వాత
ప్రభాస్ మహా నటి ఫేమ్
నాగ్ అశ్విన్ తో
సినిమా చేయబోతున్నాడు.
అశ్విని దత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.
బాలీవుడ్ స్టార్
హీరోయిన్ దీపిక పడుకునే
ప్రభాస్ కి ఇందులో జోడిగా నటిస్తుంది. ఈ సినిమాలో మరో
హీరోయిన్ కూడా నటిస్తుందని సమాచారం.
నిన్ను కోరి, జెంటిల్మాన్, జై
లవ కుశ చిత్రాలలో నటించిన నివేధ థామస్ ఇందులో నటిచబోతుంది. ఇప్పుడు ఏకంగా
ప్రభాస్ 21
మూవీ లో ఛాన్స్ వచ్చినందుకు చాలా హ్యాపీగా గా ఉందంట. ఈ
సినిమా పాన్ వరల్డ్ గా తెరకెక్కబోతుంది అని సమాచారం. ఈ చిత్రానికి
ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించబోతున్నాడట.