ఈ సినిమా 2014జనవరి 10న ఈ మూవీ రిలీజయింది. ఈ సినిమా స్క్రీన్ ప్లే బాగున్నా అది కన్ఫ్యూజ్ గా ఉండడం ఈ మూవీ ప్లాప్ అయ్యాడు కారణం. ముఖ్యంగా సాధారణ ప్రేక్షకులకి అర్ధం అయ్యేలా దీనిని తెరకెక్కించడంలో సుకుమార్ విఫలం అయ్యాడనే చెప్పాలి. ఈ చిత్రం లో అడ్వాన్స్ టెక్నాలజీ, స్క్రీన్ ప్లే కల్సి రాలేదు. అలానే ప్రేక్షకులకి తెలియని కన్ఫ్యూజన్ లో ఆడియన్స్ ని పడేశారని చెప్పాలి.
అలానే సినిమా లెన్త్ కూడా బాగా ఎక్కువగా ఉంది. సాధారణంగా రెండు గంటల 10నిముషాలు మించకుండా ఇలాంటి మూవీస్ ఉండాలి. వన్ మాత్రం 2గంటల 50నిమిషాల ఉండడం తో ఆడియన్స్ కి బోర్ కొట్టేసింది. హీరో అన్వేషణ, పగ లో ఆడియన్స్ కూడా భాగం అయ్యేలా చేయాలి అది కూడా దీనిలో మరో మైనస్ పాయింట్. కామెడీ కూడా లేక పోవడం తో పెద్దగా ఎంటర్టైన్ చెయ్యలేదు. ఇలా ఎన్నో సన్నివేశాలు ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి