బిగ్ బాస్ సీజన్ 4లో శనివారం ఎపిసోడ్ చాలా ఎమోషనల్ గా సాగింది. మొన్న జరిగిన అమీ తుమీ టాస్క్ లో అరగుండుని కాదన్నాడు అమ్మా రాజశేఖర్ అయితే శనివారం ఎపిసోడ్ లో ఆ అరగుండు చేయించుకున్న వారికి ఒక వారం నామినేషన్ నుండి సేవ్ చేస్తానని అంటాడు.. ఆ ఆఫర్ ఎవరు వినియోగించుకుంటారో చూద్దం అనగా అమ్మా రాజశేఖర్ అందుకు సరే అన్నాడు. ఒక వారం నామినేషన్ నుండి సేవ్ అయ్యేందుకు అమ్మా రాజశేఖర్ అరగుండుకి ఓకే చెప్పాడు.

అయితే ఈ టాస్క్ ఎంతో ఎమోషనల్ గా సాగింది. హౌజ్ మేట్స్ అంతా అమ్మా రాజశేఖర్ ను వద్దని చెబుతున్నా సరే ఆయన అందుకు సరే అని ఒప్పుకున్నారు. ఆ తర్వాత ఆయన కూడా కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు. నామినేషన్స్ నుండి తప్పించుకునేందుకు అమ్మా రాజశేఖర్ అంత రిస్క్ చేయాల్సిన అవసరం ఏముంది. ఒకవేళ నామినేషన్స్ లో వచ్చినా సరే ఆయన సేవ్ అయ్యే ఛాన్సులు ఉననయని అతనికంటే వీక్ కంటెస్టంట్స్ హౌజ్ లో ఉన్నారని తైసిందే.

అయితే అమీ తుమీ టాస్క్ లో అరగుండుకోసం ముందు సరే అని తర్వాత వద్దని అంటాడు అమ్మా రాజశేఖర్.. అందుకే నాగ్ అడిగినప్పుడు చేస్తానని చెయ్యి లేపారు. అయితే నాగార్జున కూడా అమ్మా రాజశేఖర్ త్యాగానికి సూపర్ అనేశారు. క్లాప్స్ కొడుతూ అమ్మా రాజశేఖర్ ను ఎంకరేజ్ చేశారు. అయితే ఈ వారం నామినేషన్స్ లో లేని అమ్మా రాజశేఖర్ నెక్స్ట్ వీక్ కూడా సెవ్ అయ్యాడన్నమాట. సో అమ్మా రాజశేఖర్ కు మరో రెండు వారాలు ఇమ్యునిటీ వచ్చినట్టే.                                             

మరింత సమాచారం తెలుసుకోండి: