జూనియర్ అభిమానులు ఈరోజు ఉదయం 11 గంటలకు విడుదల కాబోతున్న ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలోని జూనియర్ కొమరం భీమ్ పాత్రకు సంబంధించిన టీజర్ గురించి ఎంతో ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి జూనియర్ పుట్టినరోజునాడు విడుదల అవ్వవలసిన ఈ టీజర్ కరోనా సమస్యలు వల్ల ఇప్పుడు ఆలస్యంగా విడుదల అవుతోంది.


సామాన్య వ్యక్తి నుండి స్వాతంత్ర సమరయోధుడి వరకు కొమరం భీమ్ ఎదిగిన వివిధ దశలను చూపెడుతూ ఈమూవీలోని జూనియర్ పాత్ర పై క్లారిటీ వచ్చే విధంగా ఈ టీజర్ ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ టీజర్ ను హైలెట్ చేస్తూ రామ్ చరణ్ వాయస్ ఓవర్ ఉండబోతోంది. తెలుగు తమిళ కన్నడ మళయాళ హిందీ భాషలలో విడుదల కాబోతున్న ఈ టీజర్ కు చరణ్ వాయస్ ఓవర్ ఒక హైలెట్ అని అంటున్నారు.



ఈ టీజర్ కు సంబంధించి డబ్బింగ్ విషయంలో చాల శ్రద్ధ తీసుకున్న చరణ్ ఉదయం నిద్ర లేవగానే గొంతుకు సంబంధించిన ద్రవ పానీయాలు తీసుకుని మరీ డబ్బింగ్ చెప్పాదట. అంతేకాదు ఈ టీజర్ విడుదల అవుతున్న అన్ని భాషలలోను చరణ్ తన సోంత గొంతుతో డబ్బింగ్ చెప్పాడు. గతంలో చరణ్ నటిస్తున్న అల్లూరి సీతారామరాజు పాత్రకు సంబంధించిన ‘ఆర్ ఆర్ ఆర్’ టీజర్ లో జూనియర్ తన వాయస్ ఓవర్ ను తెలుగు తమిళ కన్నడ హిందీ భాషలలో మాత్రమే చెప్పాడు. మళయాళ భాష పై జూనియర్ కు పట్టు లేకపోవడంతో ఆ టీజర్ కు వేరే వ్యక్తిచేత మళయాళంలో డబ్బింగ్ చెప్పించారు.


అయితే చరణ్ మాత్రం జూనియర్ ‘ఆర్ ఆర్ ఆర్’ టీజర్ విషయంలో మళయాళంలో కూడ డబ్బింగ్ చెప్పాడట. దీనికోసం చరణ్ ఒక ట్యూటర్ ను పెట్టుకుని మళయాళ భాష పై పట్టు సాధించాడట. ఇలా ఈ టీజర్ విషయంలో తాను జూనియర్ కన్నా ఒక అడుగు ముందుకు వేసి తాను ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలో జూనియర్ కు తన పాత్ర ద్వారా గట్టి పోటీ ఇవ్వబోతున్న సంకేతాలు ఇస్తున్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: