తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం మంచి క్రేజ్ తో పాపులారిటీ తో కొనసాగుతున్న యువ సంగీత తరంగం ఎస్.ఎస్.తమన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మొదటగా బీభత్సం సినిమాతో చిత్ర రంగానికి సంగీతదర్శకుడిగా అడుగుపెట్టిన తమన్ అంతకుముందు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన బాయ్స్ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించడం జరిగింది. అయితే అంతకుముందు నుండి మణిశర్మ వద్ద గిటార్ మరియు కీబోర్డ్ ప్లేయర్ గా పనిచేసిన థమన్ కు సంగీతం అంటే అత్యంత ఇష్టం. ఇక ఆ తర్వాత బీభత్సం సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి ఆపై రవితేజ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన కిక్ సినిమాతో తొలిసారిగా భారీ విజయాన్ని అందుకున్నాడు.  

ఇక అక్కడినుండి మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్లో కొనసాగిన థమన్ అప్పట్లో ఒకదాని వెంట మరొకటి విజయాలు అందుకుంటూ మంచి పేరు దక్కించుకున్నాడు. ఒకానొక సమయం లో చాలా సినిమాలకు పని చేస్తూ ముందుకు కొనసాగిన తన కెరీర్లో  కొన్నాళ్ళ క్రితం కాపీ ట్యూన్స్ ఇస్తాడు అనేటువంటి ఒక ముద్ర పడటంతో ఇటీవల కొద్ది రోజుల క్రితం తన మ్యూజికల్ కెరీర్ కి కొంత గ్యాప్ ఇచ్చిన తమన్, శర్వానంద్ హీరోగా తెరకెక్కిన మహానుభావుడు సినిమాతో మళ్లీ టాలీవుడ్ కి సంగీతదర్శకుడిగా రీ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇక అక్కడి నుండి వరుసగా అవకాశాలతో అలానే అద్భుతమైన మ్యూజిక్ అందిస్తూ పలు విజయాలు సొంతం చేసుకుంటూ కొనసాగుతున్న థమన్ ఇటీవల స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన అలవైకుంఠపురములో సినిమా తో భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు అందులోని పాటలతో జాతీయస్థాయిలో గుర్తింపు అందుకోవడంతో మరింత గొప్ప పేరును సంపాదించాడు.

ఇక ప్రస్తుతం థమన్ చేతిలో ఎన్నో సినిమాలు ఉన్నాయనే చెప్పాలి. ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సర్కారు వారి పాట, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా, నాగచైతన్య విక్రమ్ కుమార్ ల థాంక్యూ, నాని హీరోగా తెరకెక్కుతున్న టక్ జగదీష్, బాలకృష్ణ బోయపాటి శ్రీను సినిమా అలానే నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రకటితమైన నూతన సినిమా. ఇక వీటితో పాటు మరికొన్ని సినిమాలు కూడా తమన్ లిస్టులో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విధంగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా టాలీవుడ్ లో వరుస అవకాశాలతో ఎవరికీ అందనంత ఎత్తులో దూసుకెళ్తున్న తమన్ రాబోయే రోజుల్లో ఇంకెంత క్రేజ్ అందుకుటాడో  చూడాలి..... !!

మరింత సమాచారం తెలుసుకోండి: