మామ నాగార్జున స్థానంలో  అక్కినేని సమంత బిగ్ బాస్ హౌస్ హోస్ట్ గా వచ్చి ప్రేక్షకులని బాగా అలరించింది. సమంత పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎప్పటికప్పుడు బాగా మెప్పిస్తుంది. అభిమానుల కోసం వంటలతో పాటు మొక్కలు... ఇలా అనేక వాటితో మంచి సందేశాలు ఇస్తుంది ఈ భామ.  బిగ్ బాస్ హౌస్ హోస్ట్ గా వచ్చి మామకు తగ్గ కోడలు అనిపించకుంది ఈ నటి. విజయ దశమి నాడు వచ్చి సమంత స్పెషల్ అట్రాక్షన్స్‌గా నిలిచింది. నిజంగా ఈ ఎపిసోడ్ చెప్పుకోదగ్గది.

సమంత ఫస్ట్ టైమ్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న బిగ్‌బాస్ కోసమే ఏకంగా 4 గంటలు ప్రసారం చేసారు. మొత్తంగా చీరకట్టులో అక్కినేని కోడలు హోస్ట్‌గా బాగానే మెస్మరైజ్ చేసింది. అలానే  ఈ షోలో సమంత తో పాటు  అఖిల్ అక్కినేని, పాయల్ రాజ్‌పుత్, హైపర్ ఆది, కార్తికేయ లాంటి సెలబ్రిటీస్ కూడా సపోర్ట్ చేసి బాగా ఎంటర్టైన్ చేసారు. సమంత మాత్రం తన యాంకరింగ్‌తో ఎక్కడ బోర్ కొట్టించకుండా బాగా సరదాగా నవ్విస్తూ ఎంత గానో మెప్పించేసింది. ఈ ముద్దుగుమ్మ హోస్ట్‌గా మొదటి ఎపిసోడ్ అంటే ఎవరు నమ్మరు. అంతలా ప్రేక్షకులను మాయ చేసేసింది.

వైల్డ్ డాగ్' షూటింగ్ నిమిత్తం నాగార్జున.. ఇపుడు హిమాచల్ ప్రదేశ్‌లో రోహ్‌తంగ్ పాస్‌లో షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అక్కడే కంటిన్యూగా 21 రోజులు షూటింగ్ తర్వాత నాగార్జున మళ్లీ బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తాడు. ఇది ఇలా ఉండగా  బిగ్‌బాస్ హోస్ట్‌గా సమంత ఒక్కో ఎపిసోడ్‌కు దాదాపు రూ. 40లక్షల తీసుకుంటున్నట్టు స్టార్ మా వర్గాలు చెబుతున్నాయి. దీనితో మొత్తం  5 వారాలకు గాను రూ. 2.10 కోట్ల వరకు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. కానీ హోస్ట్ చేస్తూ ఈ భామ అలరించడంలో ఎంత మాత్రం విఫలం అవ్వలేదు. చాల బాగా అలరించింది అని ఎన్ని సార్లు చెప్పిన తక్కువే, 

మరింత సమాచారం తెలుసుకోండి: