మెగా హీరో రామ్ చరణ్ తేజ్ కి గత ఏడాది పెద్దగా కలిసొచ్చింది లేదు. ఎందుకంటే ఆ ఏడాది సంక్రాంతికి బోయపాటి శీను దర్శకత్వంలో వచ్చిన వినయ విధేయ రామ అనే సినిమాని రిలీజ్ చేశారు. ఈ సినిమా భారీ అంచనాలతో రిలీజ్ అయి భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా దెబ్బకు ఆయన చాలా గ్యాప్ తీసుకోవలసి వచ్చింది. ఇక ఆ ఏడాదే తండ్రి ని హీరోగా పెట్టి సైరా నరసింహారెడ్డి అనే సినిమా తీశాడు. సినిమా పరంగా మంచి పేరు తెచ్చుకున్నా లాభాల్లో మాత్రం పెద్దగా ఉపయోగపడింది లేదు. ఇక ఇప్పుడు ఈయన దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్.ఆర్.ఆర్ అనే ఒక సినిమా చేస్తున్నాడు.

 తెలుగు స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు అలాగే కొమరం భీమ్ వీళ్ళిద్దరూ కలిస్తే ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచనతో రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇందులో అల్లూరి సీతారామరాజు రామ్ చరణ్ నటిస్తుండగా కొమురంభీం పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన రెండు బడా ఫ్యామిలీకి చెందిన హీరోలు కావడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. మామూలుగానే రాజమౌళి తన సినిమాలు లేటుగా తీస్తాడు అన్న అపవాదు ఉంది. దానికి తగ్గట్టు ఈ ఏడాది కరోనా వచ్చి పడడంతో ఈ సినిమా ఎప్పటికి పూర్తి అవుతుందో ఇంకెప్పటికీ రిలీజ్ చేస్తారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.

సినిమా రిలీజ్ సంగతి పక్కన పెడితే ప్రస్తుతానికి ఈ షూటింగ్ అప్ డేట్స్ కోసం కూడా ఫ్యాన్స్ మొహం వాచిపోయి ఉన్నారు. అందుకే లీకేజీల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునే రాజమౌళిసినిమా విషయంలో మాత్రం చిన్న చిన్న లీకేజీలు కావాలని వదులుతున్నారు. తాజాగా రామ్ చరణ్ ఆర్ఆర్ సెట్లో ఉండగా రాజమౌళి అలానే యూనిట్ మాట్లాడుతున్నట్టు ఉన్న 8 సెకన్లు వీడియో వైరల్ అయింది. అందులో షూట్ కి కావాల్సిన ఏదో ఒక సామాగ్రిని వీళ్ళందరూ పరిశీలిస్తున్నట్లుగా ఉంది. సో అలా అయినా అప్డేట్స్ అప్డేట్స్ అని ఫ్యాన్స్ చేసే రచ్చ నుండి తప్పించుకోవచ్చని రాజమౌళి భావిస్తున్నట్టుగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేయండి మరి

మరింత సమాచారం తెలుసుకోండి: