రజనీకాంత్ జీవిత చరిత్ర సినిమాగా వస్తోందంటే.. అందరికీ ఆసక్తే. ఎన్నో ఒడుదుడుకులు... ఎత్తులు చూశాడు. ఈ క్రమంలో ఎన్నో ఆసక్తి కథమైన కథాలు ఆయన జీవితంలో ఉన్నాయి. వీటన్నింటినీ తెరపై చూడాలన్న ఇంట్రెస్ట్ ఎవరికి ఉండదు. ఆయన బయోపిక్‌లో ఆయనే నటిస్తే చూడాలని అందరూ కోరుకున్నా.. ఆరోగ్య రీత్యా రజనీ నటించలేదు. ఆయన జీవిత చరిత్ర పుస్తకంగా వచ్చిన సంగతి తెలిసిందే.. త్వరలో సినిమాగా రానుంది.
రజనీకాంత్ బయోపిక్ తీయాలన్న ఆలోచన దర్శకుడు లింగుస్వామి మదిలో పుట్టింది. రజనీగా అల్లుడు ధనుష్‌ను ఎంచుకున్నాడట. బతికున్న వాళ్ల జీవిత చరిత్ర తీయాలంటే.. వాళ్ల నుంచి పర్మీషన్ తీసుకోవాలి. మరి రజనీ పర్మీషన్ ఇస్తాడా? లేదా అనేది చూడాలి.
రజనీకాంత్ బయోపిక్‌లో ఆయన్ని తప్ప మరొకరిని ఊహించుకోవడం కష్టమే. ధనుష్‌లో మంచి పెర్ఫార్మర్ ఉన్నాడు. కథకు.. క్యారెక్టర్‌కు న్యాయం చేస్తాడు. రజనీకాంత్ విషయంలో చేస్తాడా? అంటే ఎక్కడే చిన్న డౌట్. రజనీ మాదిరి స్టైలిష్ బిల్డప్‌లు ఇవ్వొచ్చు. మాడ్యులేషన్ అనుకరించవచ్చు. అయితే.. రజనీ ఫేస్‌తో పోలిస్తే.. మాత్రం ధనుష్ సూపర్‌స్టార్‌లా అనిపించడు. రజనీది మొహం పెద్దది. ధనుష్‌దేమో కోల ముఖం. పర్సనాలిటీలోనూ చాలా తేడా వుంది. ఫీచర్స్ కలవకపోయినా.. ధనుష్‌ను ఎంచుకోవడం వెనుక... అల్లుడు అనే బంధం వుండడం.. పెర్‌ఫార్మెన్స్ కారణాలు కావచ్చు. అయినా.. రజనీకాంత్ తన బయోపిక్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి కదా. చూద్దాం.. ఈ విషయంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి