తెలుగు సినీ పరిశ్రమకు సంక్రాంతి ఎప్పుడూ ప్రత్యేకమే. అయితే ఈ సంక్రాంతికి కరోనా సెగ ఉన్నప్పటికీ ఎలాగైనా సరే ...తమ సినిమాలతో థియేటర్లకు వచ్చి తీరతామని హీరోలు కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. కానీ ఉన్నట్టుండి అలా వస్తా అన్నవారే ఇప్పుడు వెనుకడుగు వేసేలా కనిపించడంతో... సంక్రాంతి సినిమాలపై మళ్లీ నీలినీడలు కమ్ముకున్నాయి.

సంక్రాంతి పండుగ టాలీవుడ్ కు ఎంత ఇంపార్టెంట్. నాలుగైదు పెద్ద సినిమాలతో పాటు, రెండుమూడు చిన్న సినిమాలు ఈ టైమ్ కు రావడానికి రెడీ అవుతున్నాయి. భారీ ఓపెనింగ్స్ తో భారీ వసూళ్లు కురిపించడానికి ప్రిపేర్ అవుతున్నాయి. అదే విధంగా చోటా ఫిలింస్ తమకున్న స్పేస్ మేరకు ఏదో కొంతలో కొంతైనా కలెక్ట్ చేయకపోతామా అని చూస్తున్నాయి. సరిగ్గా ఈ సమయంలో రెడ్ సినిమా సంక్రాంతికి రిలీజ్ కావడం లేదనే న్యూస్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

రెడ్ సినిమాకు ఓటీటీల నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినా థియేటర్లోనే తమ సినిమా రిలీజ్ చేస్తామని ఆ మధ్య రామ్ ఎంతో కాన్పిడెంట్ గా చెప్పాడు. తీరా ఇప్పుడేమో ట్రై చేస్తాం కుదరకపోతే ఓటీటీకిస్తాం అంటున్నారట. అంటే ఇక్కడ అవుట్ చూసి వారు ఈ మాట అంటున్నారంటూ పరిశ్రమ వర్గాలు నుంచి ఓ రూమర్ అయితే వినిపిస్తుంది. దీంతో రంగ్ దే, క్రాక్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కు లైన్ క్లియర్ అయిపోయింది.

రిలీజ్ టైమ్ దగ్గర పడేసరికి థియేటర్లకు ఆడియన్స్ రెస్పాన్స్ ఇప్పటిలాగానే ఉంటే వచ్చే ఆ మూడు సినినిమాలలో ఇంకో ఒకటి రెండు సినిమాలు ఓటీటీ బాట పట్టవచ్చని చెబుతున్నారు. ఒకవేళ అదే జరిగితే రిలీజ్ అయ్యే ఆ ఒక్క సినిమా కోసం ఇక థియేటర్లలో సంక్రాంతి పండగ ఏం చేసుకుంటాం. దాన్ని కూడా ఓటీటీలో రిలీజ్ చేస్తే సరిపోతుంది. ఇంతదానికి థియేటర్లో రిలీజ్ అయ్యే  సంక్రాంతి సినిమాలని ఇప్పటినుంచే గొప్పగా చెప్పుకోవడం కూడా దండగేనేమో.

మరింత సమాచారం తెలుసుకోండి: