థియేటర్లు మూతపడితే సినిమా పరిస్థితి ఏంటన్నది ఇంతవరకు ఎప్పుడూ ఎవరు కలలో కూడా ఆలోచించలేదు. కాని ఇప్పుడు సీన్ మారింది థియేటర్లు మూత పడినా సరే సినిమాలు ఆడగలవు అనే నమ్మకం వచ్చింది. థియేటర్ కు ప్రత్యామ్నాయంగా ఓటిటిలు పుట్టుకొచ్చాయి. మొదట్లో 70 ఎం.ఎం స్క్రీన్ మీద చూస్తేనే సినిమా.. టివిల్లో, సెల్ ఫోన్ లో చూస్తే ఆ కిక్ వస్తుందా అని అనుకున్నారు కాని ప్రేక్షకుల ఆలోచన మారింది. చూసేది ఎక్కడ అన్నది కాదు చూస్తున్న సినిమాలో కంటెంట్ ఉందా లేదా అన్నది చూస్తున్నారు.      

అందుకే ఈమధ్య కొత్త దర్శకులకు మంచి అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే మరో టాలెంటెడ్ డైరక్టర్ కు ఛాన్స్ లభించింది. దాదాపు 50 షార్ట్ ఫిలిమ్స్ చేసి సత్తా చాటిన తల్లాడ సాయికృష్ణ ఎందరో మహానుభావులు, బ్లాక్ బోర్డ్ సినిమాలు చేశారు. ఆ సినిమాలు కంటెంట్ బాగున్నా ఆడియెన్స్ రీచ్ అవలేదు. ఇక లేటెస్ట్ గా కొత్త కంటెంట్ తో ఓ వెబ్ సీరీస్ చేస్తున్నారు. ఈ వెబ్ సీరీస్ ను కొప్పిశెట్టి శంకర్ నిర్మిస్తున్నారు. 140 సినిమాలకు పైగా డిస్ట్రిబ్యూట్ చేసిన శంకర్ ఇప్పుడు నిర్మాతగా మారి చేస్తున్న మొదటి ప్రయత్నంగా ఈ వెబ్ సీరీస్ వస్తుంది.  

ప్రస్తుతం ఆడియెన్స్ సినిమా ఫ్లాట్ ఫాం ఏదైనా వారికి నచ్చితే సూపర్ హిట్ చేసేస్తున్నారు. ఈ వెబ్ సీరీస్ లో రాజు ఆనెం, మాధురి లీడ్ రోల్స్ చేస్తున్నారు. సీనియర్ నటుడు గౌతం రాజు, కమెడియన్ భద్రం ప్రధాన పాత్రలుగా నటిస్తున్నారు. ఈ వెబ్ సీరీస్ చేస్తుండగానే మరో సినిమా చేసేందుకు చిత్రయూనిట్ ఫిక్స్ అయ్యారట. వెబ్ సీరీస్ తో మొదలు పెట్టి ఇది పూర్తి కాగానే ఇదే ప్రొడక్షన్ లో సినిమా కూడా చేస్తారని తెలుస్తుంది.   ఈ వెబ్ సీరీస్ లో జబర్దస్త్ శాంతి స్వరూప్ శోభన్ బాబు భోగరాజు నటిస్తున్నారు. సినిమాకు శివ స్టోరీ, డైలాగ్స్ అందిస్తున్నారు.    

మరింత సమాచారం తెలుసుకోండి: