టాలీవుడ్‌లో టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం  దేవీశ్రీ.. తమన్‌.. కీరవాణి చుట్టూ తిరుగుతుంది.  ఒక్కొక్కరూ ఒక్కో పేరు చెబుతారు. అయితే ఈ ముగ్గురి కంటే ఎక్కువ సినిమాలు చేస్తూ.. క్షణం ఖాళీ లేకుండా మరో సంగీత దర్శకుడు ఉన్నాడు. ఆ మధ్య ఓ హిట్‌తో.. తనేమిటో నిరూపించుకుంటే.. చేతిలోపది సినిమాలొచ్చి పడ్డాయి.  

దేవీశ్రీ.. తమన్‌కు స్టార్‌డమ్ రాకముందే మణిశర్మ తెలుగు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపారు. ఈ మ్యూజిక్‌ డైరెక్టర్‌ డేట్స్‌ కోసం స్టార్స్‌ ఎదురుచూసిన రోజులున్నాయి. ఆ మధ్య వరుస ఫ్లాపులతో వెనుకపడిపోయిన మణిశర్మ ఇస్మార్ట్‌ శంకర్‌తో ఫామ్‌లోకి వచ్చాయి. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా.. వరుసపెట్టి సినిమాలు చేసేస్తున్నాడు మణి.  

ఇస్మార్ట్‌ శంకర్ హిట్‌తో  మణిశర్మ సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలైందనే చెప్పాలి. సినిమా విజయంలో మణిశర్మ రోల్‌ పెద్దదే. దీంతో పెద్ద సినిమాలు మణిశర్మ దగ్గరకొచ్చాయి. చిరంజీవి, కొరటాల సినిమా ఆచార్య ఛాన్స్‌  కొట్టేశాడు. చిరంజీవి, మణిశర్మ కాంబోలో 10 సినిమాలొచ్చాయి. బావగారూ బాగున్నారా.. చూడాలని వుంది.. అన్నయ్య.. ఇంద్ర.. ఠాగూర్ వంటి మ్యూజికల్ హిట్‌ ఉన్నాయి. స్టాలిన్‌ తర్వాత మరోసారి ఈ హిట్‌ కాంబినేషన్‌ వర్కవుట్‌ అవ్వడమే కాదు.. చాలా సంవత్సరాల తర్వాత మణి వర్క్‌ చేస్తున్న స్టార్‌ డైరెక్టర్‌ మెగాస్టారే.

కొరటాల అన్ని సినిమాలకూ దేవీశ్రీ మ్యూజిక్‌ ఇచ్చాడు. అయితే.. చిరంజీవి  కోసం.. ఫస్ట్ టైం మ్యూజిక్‌ డైరెక్టర్‌ని మార్చాల్సి వచ్చింది. చిరంజీవి, మణిశర్మ కాంబోలో  ఎన్నో మ్యూజికల్ హిట్స్‌ ఉన్నాయి. మరి కొరటాల, మణి కలయికలో ఎలాంటి మ్యాజిక్‌ చేస్తుందో చూడాలి.

ఇస్మార్ట్‌ శంకర్‌ తర్వాత మణిశర్మ మరోసారి రామ్‌ సినిమా రెడ్‌కు మ్యూజిక్‌ ఇస్తున్నాడు. అలాగే.. వెంకటేశ్‌ నటిస్తున్న అసురన్‌ రీమేక్‌కు కూడా మణిశర్మనే  తీసుకున్నారు. ఈ ఇద్దరి కాంబోలో ప్రేమించుకుందాంరా.. గణేశ్‌ వంటి హిట్స్ ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: