నిన్నటివరకు ఆమె క్రేజీ హీరోయిన్‌.  బంపర్‌ ఆపర్స్‌ వస్తే..  డేట్స్‌ లేక ఒదులుకుంది. కానీ ఇప్పుడు ఆమె నటించిన ప్రతి సినిమా ఫ్లాపే అవుతోంది. తెలుగులో  చేసింది రెండే సినిమాలైనా.. స్టార్స్‌తో జత కట్టి ప్రస్తుతం బాలీవుడ్‌ను ఏలుతున్న ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు కియారా అద్వానీ.

తక్కువ సమయంలో స్టార్‌ ఇమేజ్‌ దక్కించుకుంది కియారా అద్వానీ. 2014లో ఫగ్లీ అనే మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ధోని మూవీతో గుర్తింపు తెచ్చుకుంది. భరత్‌ అనేనేనులో మహేశ్‌తో జత కట్టి తెలుగులోకి స్టార్‌ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.  సినిమా సెట్స్‌పై వుండగానే.. 'వినయ విధేయ రామ' ఛాన్స్ అందుకుంది కియారా.

కియారా కెరీర్‌ను అర్జున్‌రెడ్డి హిందీ రీమేక్‌ కబీర్‌సింగ్‌ మలుపు తిప్పింది. బాక్సాఫీస్‌ వద్ద 300 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో.. బాలీవుడ్‌లో  ఈ అమ్మడిపేరు మారుమోగిపోయింది. ఆ తర్వాత వరుస అవకాశాలతో బిజీ అయిపోయిన కియారా... 'గుడ్‌న్యూస్‌'తో మరో సక్సెస్‌ అందుకుంది.

కబీర్‌సింగ్‌ హిట్‌ తర్వాత  కియారా డేట్స్‌ సంపాదించడం కష్టమైంది. తెలుగులో కొన్ని ఆఫర్స్‌ వచ్చినా.. డేట్స్ ఎడ్జెస్ట్‌ చేయలేకవదిలేసుకుంది. ఆచార్యలో రామ్‌చరన్‌ పక్కన హీరోయిన్‌గా అనుకుంటున్నారేగానీ.. కన్ఫార్మ్ చేయలేదు. ఇంతలో కియారా ఫ్లాపుల పరంపర మొదలైంది. లాక్‌డౌన్‌ తర్వాత  'ఇందూ కీ జవానీ' రిలీజైతే.. వీకెండ్‌ మొత్తం మీద 50 లక్షలు కూడా కలెక్ట్ చేయలేదు. కోటి దాటడం కష్టమే అంటున్నారు. ఈలెక్కన ఈ అమ్మడి రెమ్యునరేషన్‌ కూడా రావడం లేదు.

కియారా ఎన్నో ఆశలు పెట్టుకున్న 'లక్ష్మీబాంబ్‌' నిరాశపరిచింది. అక్షయ్‌కుమార్‌తో జత కట్టిన ఈ మూవీ ఓటీటీలో రిలీజ్‌కాగా.. ఈ హారర్‌ థ్రిల్లర్‌ను ఎవరూ పట్టించుకోలేదు. వరుస ఫ్లాపులు వస్తున్నా.. అమ్మడికి వచ్చిన నష్టమేమీ లేదు. షేర్షా.. బూల్‌ బులాయియా2.. జగ్‌ జగ్‌ జీయో వంటి క్రేజీ మూవీస్‌ ఈ అమ్మడి చేతిలో వున్నాయి. డేట్స్ ఇవ్వాలేగానీ.. తెలుగు స్టార్స్‌  ఛాన్సులు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. కియారా డేట్స్‌ లేక పూజా.. లేదంటే రష్మికను తీసుకున్న సందర్భాలూ ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: