ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...సాధారణంగా అందరం కూడా కొత్త సంవత్సరంలో కొత్త నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు పరచాలని అనుకుంటూ ఉంటాం.ఇక సినీ ప్రముఖులు ఇంకా సెలబ్రిటీలు కూడా ఇలా కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటాడు. ఇక ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా అలాంటి ఓ నిర్ణయం తీసుకున్నాడు.ఇకపై తన సినిమాలకు సంబంధించి స్టైలిష్ ఐకానిక్ డ్రెస్సులు, వస్తువులను భద్రపరచాలి నిర్ణయించుకున్నాడు అల్లు అర్జున్. ‘అల.. వైకుంఠపురములో’ సినిమా నుంచి ఈ నిర్ణయాన్ని  సీరియస్ గా అమలు చేస్తున్నానని చెప్పాడు బన్నీ.

‘అల.. వైకుంఠపురములో’ సినిమాలో ఆఫీస్ లో మీటింఫ్ సన్నివేశం కోసం వేసుకున్న ఎరుపు రంగు కోటును ఇంకా అలాగే బుట్టబొమ్మ పాటలో వేసుకున్న పూల చొక్కాను భద్రంగా దాచుకున్నట్లు తెలిపాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ప్రతీ సినిమాకి సంబంధించిన కొన్ని బట్టలు, వస్తువులు ఇలా దాచిపెట్టడం వలన కొన్నేళ్ల తరువాత వాటి విలువ మరింత పెరుగుతుందని అంటున్నాడు స్టైలిష్. అంతేకాకుండా.. అవి మంచి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయని చెబుతున్నాడు. నిజానికి ‘అల.. వైకుంఠపురంలో’ సినిమా కంటే ముందు నుండే బన్నీకి ఈ అలవాటు ఉంది. ‘ఆర్య2’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘సరైనోడు’ సినిమాలకు చెందిన కొన్ని వస్తువులను బన్నీ దాచుకున్నాడు. వాటిలో కొన్ని గతంలో సమంత నిర్వహిస్తోన్న ఛారిటీ కోసం ఇచ్చేశాడు.

ఇక నుండి మాత్రం ఇలా వస్తువులు సేకరించడం సీరియస్ గా అమలు చేస్తానని.. ప్రతీ సినిమాకి సంబంధించిన ఓ జ్ఞాపకాన్ని దాచుకుంటానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ హీరో సుకుమార్ డైరెక్ట్ చేస్తోన్న ‘పుష్ప’ సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది.ఇక ఇలాంటి    మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.... 

మరింత సమాచారం తెలుసుకోండి: