అనతి కాలంలోనే స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ కు జోడీగా బాలీవుడ్ భామ అనన్యా పాండే నటిస్తుంది. డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ కు డేరింగ్ అండ్ డ్యాషింగ్ హీరో దొరికితే సినిమా ఎలా ఉంటుంది. ఫైటర్ టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ సినిమా రౌడీ హీరో ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్ ఇస్తుందని అంటున్నారు. కరోనా లాక్ డౌన్ కు ముందు ముంబైలో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా నుండి అఫీషియల్ పోస్టర్స్ రాలేదు.

ఇక లేటెస్ట్ గా పూరీ, విజయ్ కాంబినేషన్ లో సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ ప్లాన్ చేశారు. జనవరి 18న ఈ సినిమా టైటిల్ పోస్టర్ తో పాటుగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు ఫైటర్ అనే సినిమా ప్రచారంలో ఉంది. సినిమాలో విజయ్ డాన్ తనయుడిగా కనిపిస్తాడని తెలుస్తుంది. రౌడీ ఫ్యాన్స్ అందరు కోరుకునే అంశాలతో ఈ సినిమా ప్లాన్ చేస్తున్నాడట పూరీ జగన్నాథ్. టాక్సీవాలా హిట్ తర్వాత డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు చేసినా ఆ రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అందుకే విజయ్ తన ఫోకస్ అంతా పూరీ సినిమా మీద పెట్టాడు.

ఇస్మార్ట్ శంకర్ తో హిట్ అందుకున్న పూరీ విజయ్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో పెద్ద హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు. పూరీ కాన్ ఫిడెన్స్ చూస్తుంటే ఈ సినిమా అనుకున్న దాని కన్నా ఎక్కువ సక్సెస్ అయ్యేలా ఉంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. రేపు రిలీజ్ అవుతున్న టైటిల్ ఫస్ట్ లుక్ చూసి కూడా సినిమాపై అంచనాలు పెరిగే ఛాన్స్ ఉంది.     

మరింత సమాచారం తెలుసుకోండి: