మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న ఆచార్య సినిమాలో రాం చరణ్ కూడా నటిస్తున్నాడన్న విషయం తెలిసిందే. కొరటాల శివ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో రాం చరణ్ చేస్తున్న సిద్ధ పాత్రకు సంబందించి ప్రీ లుక్ వదిలారు. సినిమాలో చరణ్ పాత్ర హైలెట్ గా ఉంటుందని అంటున్నారు. అయితే ఈ సినిమాలో సిద్ధ పాత్రని షూట్ చేసేది కొరటాల శివ కాదట. సినిమాలో సిద్ధా పాత్ర మొత్తం ఎపిసోడ్ దర్శక ధీరుడు రాజమౌళి షూట్ చేస్తారని అంటున్నారు. అదేంటి డైరక్టర్ కొరటాల శివ అయితే ఆచార్యలోని రాం చరణ్ పాత్రని జక్కన్న ఎలా డైరెక్ట్ చేస్తారని డౌట్ పడుతున్నారు ప్రేక్షకులు.

కొరటాల శివ చరణ్ కు చెప్పిన సిద్ధ పాత్ర చెప్పడంతో రాజమౌళి స్వయంగా ఆ పాత్రని షూట్ చేస్తానని అన్నారట. రాజమౌళి డైరెక్ట్ చేస్తే ఆ సీన్ ఎలా ఉంటుందో తెలిసిందే. సిద్ధ ఎంట్రీ సీన్ జక్కన్న స్టైల్ లో ఉంటుందని అంటున్నారు. కొరటాల శివ సినిమా అంటే మెసేజ్ తో పాటుగా కమర్షియల్ అంశాలు ఉంటాయి. మెగా ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు ఆచార్యలో ఉంచుతున్నారట. స్పెషల్ ఎట్రాక్షన్ గా చరణ్ ఇప్పటివరకు చేయని పాత్ర చేస్తున్నాడని అంటున్నారు.

చిరు, చరణ్ సిల్వర్ స్క్రీన్ పై చేసే సందడికి మెగా ఫ్యాన్స్ అంతా ఖుషి అవడం పక్కా అని చెప్పొచ్చు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఆచార్య సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. చరణ్ కు జోడీగా రష్మిక మందన్న కూడా నటిస్తుందని టాక్. ఈ సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఆచార్య అఫీషియల్ రిలీజ్ డేట్ తెలియాల్సి ఉంది.                              

మరింత సమాచారం తెలుసుకోండి: