ప్రస్తుతం బుల్లితెరపై జబర్దస్త్ కార్యక్రమానికి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  అయితే జబర్దస్త్ కార్య క్రమంలో ప్రస్తుతం బాగా గుర్తింపు సంపాదించుకున్న కమెడియన్స్ లో బుల్లెట్ భాస్కర్ ఒకరు అన్న విషయం తెలిసిందే. అయితే ఎన్నో రోజుల నుంచి జబర్దస్త్ లో కొనసాగుతూ టీం లీడర్ గా ఎన్నో స్కిట్స్   చేసి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఎప్పటికప్పుడు తనదైన శైలిలో వినూత్నమైన కామెడీని బుల్లితెర ప్రేక్షకులకు పంచుతూ ప్రస్తుతం టాప్ టీం లీడర్ గా కొనసాగుతున్నాడు.


 అయితే ఎప్పుడూ జబర్దస్త్ లో తనదైన శైలిలో వినూత్నమైన కామెడీ చేసేందుకు ఎంతగానో ప్రయత్నాలు చేస్తూనే బుల్లెట్ భాస్కర్.  ఇక సరికొత్త స్కిట్ లతో తెర మీదికి వచ్చి బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు అనే విషయం తెలిసిందే.  ప్రతీ వారం కూడా బుల్లెట్ భాస్కర్ స్కిట్స్ అన్నింటిలో ఎంతో కసి  కనిపిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇప్పుడు వరకు జబర్దస్త్ లో  ఎంతో మంది అబ్బాయిలు లేడీ గెటప్ వేసి బుల్లితెర ప్రేక్షకులు అందరినీ అలరించటం  ఎపిసోడ్స్ ఎన్నో చూశారు. కొన్ని కొన్ని సార్లు గెటప్ శీను, రామ్ ప్రసాద్ లాంటి వాళ్లే కాదు సుడిగాలి సుధీర్ లాంటివాళ్ళు కూడా లేడీ గెటప్ వేసి బుల్లితెర ప్రేక్షకులను అలరించారు.



 కానీ ఇప్పటివరకు బుల్లెట్ భాస్కర్ లేడీ గెటప్ అది కూడా చీర లో లేడీ గెటప్ వేయడాన్ని ఎవరు చూసి ఉండరు. అప్పుడెప్పుడో రెండేళ్ల కిందట అమ్మాయి గెటప్ లో కనిపించిన బుల్లెట్ భాస్కర్ ఇప్పుడు  స్కిట్ లో భాగంగా లేడీ గెటప్ వేశాడు.  కిందనుంచి పైవరకు చీర వేసుకొని ఇక సాంప్రదాయమైన అమ్మాయిల మారిపోయి అందరికీ షాకిచ్చాడు బుల్లెట్ భాస్కర్.  బుల్లెట్ భాస్కర్ స్కిట్ లో ఆటో రాంప్రసాద్ కూడా కనిపించాడు. ఇక బుల్లెట్ భాస్కర్ లేడీ గెటప్ లో కనిపించ గానే  అటు బుల్లితెర ప్రేక్షకులు అందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు. ఏదేమైనా ప్రస్తుతం బుల్లెట్ భాస్కర్ లేడీ గెటప్ మాత్రం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: