తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని సమంతకి ఎంత క్రెజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే సమంత మొదటి తెలుగు సినిమా నాగచైతన్య హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఏమాయ చేశావే’ ఈ సినిమాలో జెస్సీగా సమంత తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకుంది. ముఖ్యంగా అప్పటి యూత్ జెస్సీ మాటలకు, ఆమె అందానికి పడి పోయి ఆ సినిమాను పదే పదే చూసిన సందర్బాలున్నాయి.

సినిమా బంపర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ ‘బృందావనం’లో ఇందుగా.. గ్లామర్ పాత్రలో మెరిసింది. ఆ తర్వాత మహేష్ బాబు ‘దూకుడు’లో మోడల్ ప్రశాంతిగా మెప్పించింది. ఈ మధ్యకాలంలో కొన్ని తమిళ సినిమాల్లో హీరోయిన్‌గా సత్తా చాటింది. హీరోయిన్‌గా టాప్ పొజిషన్‌లో ఉండగానే నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. చాలా మందికి సమంత అక్కినేని సినిమాల గురించి అక్కినేని ఫ్యామిలీ గురించి తెలుసు కానీ.. ఆమె పర్సనల్ విషయాల గురించి చాలా తక్కువ మందికే తెలుసు.

దూకుడు సినిమాతో సమంత స్టార్ హీరోయిన్ గా ఎదిగింది అని చెప్పోచ్చు.. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన నటించి. ఆ తర్వాత హేష్ బాబు దూకుడులో మోడల్ ప్రశాంతిగా మెప్పించింది.సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. సమంత ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి ఈ సినిమా ఎంతగానో ఉపయోగపడింది. ఈగ సినిమా యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం. ఈ సినిమాలో సమంత యాక్టింగ్ కి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఈ మధ్యకాలంలో కొన్ని తమిళ సినిమాల్లో కూడా నటించింది.ఆ తర్వాత అత్తారింటికి దారేదిసినిమాలో పవన్ తో నటించింది. ఆ తర్వాత అక్కినేని కుంటుంబం మొత్తం కలిసి నటించిన మనం సినిమాలో ప్రియగా నటించింది. తరువాత రంగస్థలం లో పల్లెటూరి యువతి రామలక్ష్మి పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే.ఆ తర్వాత తన భర్త నాగ చైతన్యతో చేసిన మజిలీలో సామాన్య గృహిణిగా మెప్పించింది. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, అఆ, ఓ బేబీ  సినిమాలు సమంత సినీ జీవితంలో చెరగని ముద్ర వేసుకుంది.




మరింత సమాచారం తెలుసుకోండి: